దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటుంది . దాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళితేనే ఎవరికైనా విలువ ఉంటుంది. అలాకాకుండా ఇష్టానుసారంగ మాట్లాడితే తర్వాత అభాసుపాలు అవ్వాల్సిందే. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ముఖ్యంగా ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ను     సమర్థవంతంగా అమలు చేస్తున్నా, కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ దశలో ప్రజలు భయాందోళనకు గురి కాకుండా వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది. పార్టీలకు అతీతంగా ప్రజల బాగోగులు గురించి పట్టించుకోవడం రాజకీయ నాయకుల బాధ్యత. అలా కాకుండా ఎప్పటి మామూలుగానే రాజకీయాలు చేస్తే, ప్రజల నుంచి వ్యతిరేక పెరగడం మాత్రం తప్పదు. 

 

IHG


తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను పరిగణలోకి తీసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది . కరోనా వైరస్ బాధితుల సంఖ్యను వైసీపీ ప్రభుత్వం కావాలనే దాచిపెడుతుంది అంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. కరోనా విషయంలో నిజాలు దాచి పెడితే నష్టం ఎవరికి అన్నది చంద్రబాబు  పరిగణలోకి తీసుకోవడం లేదు. కరోనా వైరస్ సంక్రమించిన వ్యక్తి బయట ఉంటే, అతని ద్వారా వందల మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని దాస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇతర దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కరోనా వ్యాధితో చనిపోయిన ఆ మృతదేహాన్ని చాలా జాగ్రత్తగా ఖననం చేయాల్సిన బాధ్యత, అంత్యక్రియల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే చంద్రబాబు మాత్రం పాజిటివ్ కేసుల్లో చనిపోయిన వారి వివరాలు ప్రభుత్వం దాచిపెడుతుంది అంటూ ఆరోపణలు చేయడం విమర్శల పాలవుతోంది. 

 


వాస్తవంగా చెప్పుకుంటే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ముందులో పెద్దగా కనిపించలేదు. అయితే ఢిల్లీలో మర్కజ్  వ్యవహారంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త చర్యల కారణంగా పరిస్థితి అదుపులో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ ఘటనతో ఏపీ లో వైరస్ ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఉంది.అసలు వైరస్ తో చనిపోయిన వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మరి అటువంటప్పుడు మృతుల సంఖ్య దాచిపెట్టడం ద్వారా ప్రభుత్వానికి ఏ ప్రయోజనం కలుగుతుందో చంద్రబాబు కే తెలియాలి. ఇప్పుడు రాజకీయాలు చేసే కంటే ప్రజలను చైతన్యవంతం చేసే విషయంలో చంద్రబాబు దృష్టి పెడితే ఆయన పై మరింత గౌరవం పెరుగుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: