కాకినాడ కుర్రాడు ఒకడు కరోనా వైరస్ పై పోరాటం చేసి విజయం సాధించాడు. లండన్ నుండి వచ్చిన కుర్రాడు మార్చి 22వ తేదీన వైరస్ బారినపడ్డాడు. లక్షణాలు గ్రహించిన వెంటనే వైద్యులు కాకినాడ గవర్నమెంటు ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుల్లో చేర్పించారు.  రెండు వారాల పాటు వైద్య సిబ్బంది ఈ కుర్రాడుని జాగ్రత్తగా చూసుకుంది. ఈ రెండు వారాల్లో కుర్రాడిని రెగ్యులర్ గా చెక్ చేస్తునే ఉన్నారు. చివరగా  పరీక్షలు చేసిన రెండుసార్లు ఇతనికి నెగిటివ్ రిజల్ట్ రావటంతో వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

 

యువకుడు మాట్లాడుతూ లండన్ నుండి తాను దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుండి కాకినాడ చేరుకున్నట్లు చెప్పాడు. తనతో పాటు ప్రయాణించిన వ్యక్తికి కరోనా వైరస్ ఉందని చెప్పాడు. దాంతో  కాకినాడకు చేరుకునేటప్పటికి అనుమానం వచ్చిందట. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అవసరమైన పరీక్షలు చేయించుకున్నాడు. దాంతో తనకు వైరస్ ఉందని నిర్ధారణ అవ్వటంతో వెంటనే ఐసొలేషన్ వార్డులో చేరిపోయాడు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాకినాడకు చేరుకోగానే యువకుడు బాధ్యత గుర్తు పెట్టుకుని ఆసుపత్రికి వెళ్ళాడు పరీక్షల కోసం. అతను ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్ధితి ఏంటి ? పైగా కుర్రాడు కనీసం కుటుంబసభ్యులను కూడా దగ్గరకు రానీయలేదు. ఎప్పుడైతే కుర్రాడికి వైరస్ ఉందని తేలిందో వెంటనే కుటుంబసభ్యులను కూడా డాక్టర్లు పరీక్షించారు. అయితే అదృష్టవశాత్తు కుటుంబసభ్యుల్లో ఎవరికీ వైరస్ సోకలేదు.

 

ఐసొలేషన్ వార్డులో ఉన్నంత కాలం వైద్య సిబ్బంది ఉదయం, రాత్రి రెండుసార్లు టెస్టులు చేశారని చెప్పాడు.  వైద్య సిబ్బంది చెప్పిన సూచనలను తాను క్రమం తప్పకుండా అనుసరించిన కారణంగానే తొందరగానే బయటపడ్డినట్లు యువకుడు చెప్పాడు. అందరు అనుకున్నట్లుగా వైరస్ అంత ప్రమాధకరం కాదన్నాడు. కాకపోతే జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందులు ఉండవని చెప్పటాన్ని అందరూ గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: