ప్ర‌పంచంలో అనుకోని విప‌త్తులుగానీ, ఘ‌ట‌న‌లు గానీ జ‌రిగిన స‌మ‌యంలో జ‌న్మించిన వారికి ఆ ఘ‌ట‌న‌ల పేర్ల‌ను పెట్ట‌డం స‌హ‌జంగా మ‌నం చూ స్తుంటాం. కొన్ని నెల‌లుగా ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో రాయ్‌పూర్‌లో జ‌న్మించిన క‌వ‌ల‌ల‌కు క‌రోనా, కొవిడ్ గా నామ‌క‌ర‌ణం చేశారు త‌ల్లిదండ్రులు.  ఇప్పుడు ప్రపంచంలో కరోనా, కొవిడ్ పేర్లు వింటేనే జ‌నం బెంబేలెత్తుతున్నారు. ఈ వైర‌స్ సోకిన వారిని చూస్తేనా అమ్మో అంటూ దూరంగా ప‌రుగెడుతున్నారు.

 

కానీ త‌మ‌కు పుట్టిన క‌వ‌ల పిల్ల‌ల‌కు క‌రోనా, కొవిడ్ పేర్లు పెట్టి ఆనంద‌పడుతున్నారు ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రానికి చెందిన  ప్రీతి వర్మ దంపతులు. రాయ్‌పూర్‌లో నివాసం ఉంటున్న ప్రీతి వర్మకు ఈనెల 26వ తేదీన పురిటినొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. లాక్‌డౌన్‌ కట్టడితో క్లిష్ట పరిస్థితుల్లో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

 

ఈనెల 27వ తేదీ తెల్లవారు జామున ఆమె పండంటి కవలలకు (మగపిల్లాడు, ఆడపిల్ల) జన్మనిచ్చింది. ఆ పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టి ఈ దంపతులు మురిసిపోతున్నారు.  ఈసందర్భంగా బిడ్డల తల్లి ప్రీతివర్మ  మాట్లాడుతూ నేను నా భ‌ర్త ముందు అనుకున్న పేర్లను పక్కన పెట్టి ఈ కొత్త పేర్లు వారికి పెట్టుకున్నాం ‘ అని ప్రీతివర్మ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: