ఏపీలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం, ఇప్ప‌టికే వైర‌స్ బారిన ప‌డి ఒక‌రు చ‌నిపోవ‌డంతో ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్తం అయింది. ఒక ప‌క్క క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటూనే , మ‌రోప‌క్క ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రించేందుకు కృషి చేస్తోంది. దీంతో క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌ల్లో కూడా మ‌రింత వేగం పెర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా విశాఖ‌ప‌ట్ట‌ణంలోని కింగ్ జార్జ్ హాస్ప‌ట‌ల్‌లో వైర‌స్ నిర్దార‌ణ ప‌రీక్ష‌కేంద్రాన్ని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.

 

 

ఈ క‌రోనా ప‌రీక్ష ల్యాబ్‌ను రాష్ట్ర మంత్రి అవంత్ శ్రీనివాస్ ప్రారంభించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ కోసం ప్ర‌భుత్వం తీసుకుం టున్న చ‌ర్య‌ల‌కు ప్ర‌జ‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌జ‌లు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌తోపాటు ప‌రిస‌రాలను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని, అత్య‌వ‌సరం అయితే త‌ప్ప ప్ర‌జ‌లెవ‌రూ ఇల్లు దాటి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆయ‌న కోరారు.  కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలోని 13 జిల్లాల్లో 161 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: