దేశ వ్యాప్తంగా కరోనా సంఖ్య పెరుగుతూ ఉంది.  మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కేసులు నమోదు కాకున్నా.. ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వారం వరకు తక్కువగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఢిల్లీ తబ్లీగ్ జమాతేకు వెళ్లి వచ్చిన వారితో ఒక్కసారిగా పెరిగింది.  దారుణమైన విషయం ఏంటేంటే.. జమాతేకు వెళ్లివచ్చిన వారితో పాటు వాళ్ల బంధువులు, కలిసిన వారికి కరోనా సోకింది.
 ఇప్పటి వరకు ఏపీ నుంచి తబ్లీగ్ జమాతే‌కు వెళ్లిన వారు 1085 మందిగా గుర్తించారు. ఇందులో రాష్ట్రంలో 946 మంది ఉన్నారు.

 

వీరిలో 881 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు.  108 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ఏపీలో ఇప్పటి వరకు 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 140 మంది ఢిల్లీ జమాతే‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారు. ఇంకా ఎవరైన వీరితో కాంటాక్ట్ అయ్యారా..? ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా..? అనే అంశంపై విచారణ చేస్తున్నామని అధికారులు అంటున్నారు.  అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కరానా కేసులు ఉన్నఫలంగా పెరిగిపోవడానికి గల కారణం ఢిల్లీ మూలాలే అంటున్నారు.  

 

ఇక గురువారం 27 మందికి వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో కేసుల సంఖ్య 154కు చేరింది. ఈ మొత్తం కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు, వారి బంధువులే 86 మంది ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు మొత్తం 9 మంది చనిపోయారు.  తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఎంత మందితో కాంటాక్ట్ అయ్యారో చెప్పలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: