కరోనా వైరస్ ను నివారించేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ చేసింది… అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు రాకూడదని చెబుతున్నారు.  అయితే లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసర వస్తువులు విక్రయించడానికి మాత్రమే పరిమిషన్ ఇచ్చారు. పాల కేంద్రాలు, కిరాణ, కూరగాయ, పండ్ల మార్కెట్, మెడికల్ షాపులు ఇలా కొన్నింటికి మాత్రమే పరిమితి ఉంది.  లాక్ డౌన్ మొదలైన్పటి నుంచి మద్యం దుకాణాలు అన్నీ బంద్ చేశారు.  అప్పటి నుంచి మద్యం బాబులకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో మందు బాబులు ఏం చెయ్యాలో దిక్కు తోచని స్ధితిలో ఉన్నారు కొందరు అయితే పచ్చి పచ్చిగా ప్రవర్తిస్తున్నారు… ఇక మరికొందరు మందు దొరకక ఆత్యహత్యయత్నానికి పాల్పడుతున్నారు.  

 

కొంత మంది ఇంట్లో పిచ్చి పట్టినవారిలా ప్రవర్తించడం.. ఉన్మాదులుగా మారడం.. మరికొంత మంది దారుణంగా ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి రోగులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది… దాదాపు రెండు రోజుల్లో ఓపికి వందకు పైగా బాధితులు నమోదు అయ్యారు.  అయితే మధ్యం దొరకకపోయేసరికి కొందరికి శరీరంలో విపరీతమైన వణుకు వస్తుందని దీనిని ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారని డాక్టర్ ఆశా మౌనిక తెలిపారు.

 

మొదటి దశలో శరీరంలో విపరీతమైన వొణుకు వస్తుందని తర్వాత ఇలాంటి వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ తెలిపారు. ఇటాంటి వారికి వెంటనే ట్రీట్ మెంట్ చేయాలని ఆమె అన్నారు. ఇక ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలోకి ఓపీ కోసం రోగుల తాకిడి పెరిగింది. నిన్న 50 మంది రాగా.. ఈ రోజు 100 మందికి పైగా బాధితులు ఆసుపత్రి కి వచ్చి క్యూ కడుతున్నారు. 

 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: