దేశంలో కరోనాని అరికట్టాలని దేశం ఎన్నడూ లేని విధంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.   అయితే గత నెల 13 న  ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ప్రార్థనా మందిరంలో పాల్గొన్న వారి లో చాలా మందికి కరోనా వైరస్ ఎటాక్ చేసిందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మర్కజ్‌కు వెళ్లొచ్చిన  వారి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు తెలుగు రాష్ట్ర అధికారులు. అందులో భాగంగానే మర్కజ్ వెళ్లొచ్చిన వారి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన ఆశా వర్కర్‌కు ఆదిలాబాద్‌లో చేదు అనుభం ఎదురయ్యింది. 

 

ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి వివరాలు అడిగినందుకు ఆశా వర్కర్‌ను ఇంట్లో బంధించారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లాలోని శివాజీ చౌక్‌లో ఓ అశా వర్కర్ మర్కజ్ వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లారు. దాంతో కోపోద్రిక్తులైన ఆ కుటుంబ సభ్యులు ఆమె వద్ద ఉన్న రిజిస్ట్రర్ ని లాగి చింపేశారు. అంతే కాదు మమ్ముల్ని అనుమానిస్తావా అంటూ ఆవేశంగా ఇంట్లో బంధించారు.  ఒక్కసారే జరిగిన పరిణామాలకు ఆమె కిన్నురాలైంది. 

 

వెంటనే తేరుకొని కుటుంబ సభ్యులను బ్రతిమిలాడి ఎలాగో అలా బయట పడింది. బయటకు రాగానే విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.  కాగా, ఢిల్లీలో జరిగిన మార్కజ్‌కు వెళ్లినవారిని గుర్తించే పనిలో బిజీ అయిపోయారు వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు, పోలీసులు. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో మార్కజ్‌కి వెళ్లివచ్చారు.. ఇప్పటికే మన రాష్ట్రానికి చెందినవారిని దాదాపుగా గుర్తించిన పోలీసులు.. వారిని టెస్ట్‌ల కోసం ఆస్పత్రులకు తరలించారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: