ప్రపంచంలో అమ్మ ప్రేమ ముందు ఏదీ గొప్పది కాదంటారు. తొమ్మిది నెలలు మోసి మనల్ని కంటికి రెప్పలా కాపాడే తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.  అందుకే కవులు, పండితులు అమ్మపై ఎన్నో కవితలు, పద్యాలు రచించారు.  అమ్మ సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి.  కష్టాల్లో ఉన్నపుడు మనకు గుర్తుకు వచ్చేది అమ్మ.  తాజాగా ఓ తల్లి తన కన్నబిడ్డల కోసం ఎంత త్యాగం చేసిందో చూస్తు అవును.. తల్లి ప్రేమ ఎంతో గొప్పదని అంటారు.  ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది.  దేశంలో కరోనా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ఎక్కడి వ్యవస్థలు అక్కడే దిగ్భందం అయ్యాయి.

 

కరోనా వల్ల పేద ప్రజలు,  రోజు వారి కూలీలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.  పొట్ట చేతపట్టుకుని కూలీపనుల కోసం వెళ్లి అక్కడ కూలీ లేక ఉపాది లేక డబ్బు లేక చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లలేక రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ సమయంలో ఓ తల్లి పిల్లల ఆకలి చూసి తల్లడిల్లిపోయింది, అక్కడ ఉచితంగా ప్రభుత్వం అన్నం పెడుతోంది అని తెలుసుకుంది.  తన పిల్లల ఆకలి తీర్చేందుకు ఎంత కష్టమైన పడటానికి సిద్ద పడింది. అక్కడ సామాజిక దూరం పాటించాలన్న నియమనిబంధన పెట్టడంతో ఆమె ఏకంగా పదకొండు గంటలు అలాగే లైన్లో నిలబడింది.  

 

చివరికి ఆమెకు రెండు ఆహార పొట్లాలు దొరికాయి... దాంతో తన పిల్లలకు కాస్త బోజనం దొరికిందని సంతోషించింది. ఒక ఆహరపొట్లం పిల్లలకు పెట్టి ఆమె రెండు ముద్దలు తింది, సాయంత్రం అన్నం దొరకదు అని అదే ఆహరం దాచుకుంది, తల్లి ప్రేమచూసి ఓ వ్యక్తి ఆమె వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు, అతను ఆమెకి 500 సాయం చేసి పిల్లలకు పాలు పట్టించమని చెప్పాడు. 

 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: