ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్ళిన వారి విషయంలో ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, వారు దక్షినాది రాష్ట్రాలకు చుక్కలు చూపిస్తున్నారు. కరోనా వైరస్ ని కట్టడి హేయడానికి ఇప్పుడు వాళ్ళు పెద్ద సమస్యగా మారారు అనే విషయం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంగా అర్ధమైంది. వాళ్ళను జాగ్రత్తగా వచ్చి లొంగిపోవాలి అని సూచించినా సరే ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ప్రభుత్వాలు ఇప్పుడు వాళ్ళను పట్టుకోవడానికి గానూ నానా కష్టాలు పడుతున్నాయి. అయినా సరే వాళ్ళు మాత్రం బయటకు వచ్చి సహకారం అందించడం లేదు. 

 

బయటకు రావాలని ఉచితంగా వైద్యం చేస్తామని ఎన్ని ప్రభుత్వాలు చెప్పినా సరే వాళ్ళు మాత్రం బయటకు రాకుండా తప్పించుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు దేశానికి ప్రమాదకరంగా మారారు అనే విషయం అర్ధమవుతుంది. వారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం ఇంకా కేసులు పెరుగుతాయని కొందరు అంటున్నారు. ఇక్కడ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం మతాలను విమర్శిస్తున్నారు అని పదే పదే మాట్లాడుతున్నారు. ఎవరికి ఆ అవసరం లేదు. వాళ్ళ నుంచి వ్యాపిస్తుంది అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

వాళ్ళను పట్టుకోవడానికి వెళ్ళిన సమయంలో వాళ్ళు పారిపోవడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. వాళ్ళను బయటకు రావాలని కోరుతున్నా పట్టుకోవడానికి వెళ్తున్నా ఎందుకు పారిపోవాల్సి వస్తుందో అర్ధం కావడం లేదు. కొంత మంది వైరస్ ని కావాలని విస్తరిస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పుడు వారి గురించే ఆందోళన అంతా కూడా. అయినా సరే వాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఇష్టం వచ్చినట్టు చేయడం పై ఇప్పుడు ప్రభుత్వాలు ఆగ్రహంగా ఉన్నాయి. వాళ్ళు మాత్రం భయపడటం లేదు. దీనితో వాళ్లకు జైలు శిక్ష కఠినం గా విధించాలి పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: