ప్రపంచ దేశాలలో కరోనా కొవిడ్ - 19 శివ తాండవం చేస్తోంది. రోజు రోజుకూ వైరస్ గొలుసు జఠిలమై... తీవ్ర రూపం దాల్చుతూ.. ప్రజల ప్రాణాలను హరించి వేస్తోంది. ప్రస్తుత లెక్కలను బట్టి చూసుకుంటే... ప్రపంచ వ్యాప్తంగా, ఈ మహమ్మారి కాటు వేసిన వారి సంఖ్య ఒక మిలియన్ పైనే వుంది. ఒక్క ఐరోపా ఖండంలోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదవ్వడం బాధాకరం. సుమారుగా 200 దేశాలకు పైగా కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
 

ఇక మన దేశంలో ఒడిశా ప్రభుత్వం కరోనా నియంత్రణకు చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలకంటే, ఒడిశాలో ముందుగానే లాక్డౌన్ విధించిన సంగతి యెంత మందికి తెలుసు? అలాగే ఇక్కడ కోవిడ్-19 బాధితులకు చికిత్స అందజేయడానికి ప్రత్యేకంగా 1,000 పడకల హాస్పిటల్ ను సిద్ధం చేయడం సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. తాజాగా, భువనేశ్వర్, భద్రక్ పట్టణాలను పూర్తిగా 48 గంటల పాటు షట్డౌన్ చేస్తున్నట్టు ఒడిశా సీఎం ప్రకటించడం గమనార్హం.

 

ఇక కరోనాకు పురుడు పోసిన చైనా... అక్కడ సదరు కరోనా బాధితులకు సేవ చేసే క్రమంలో చనిపోయిన వైద్యులకు.. ఇంకా ఇతరత్రా సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వాలంటీర్లకు ఈ ఏప్రిల్ 4న అంటే రేపు, అనగా... శనివారం నాడు.. జాతీయ సంతాప దినంగా ప్రకటించి, ఆరోజు.. సదరు త్యాగమూర్తులకు నివాళులు అర్పించనున్నారు. ఇక కరోనా వైరస్ బాధితుల సంఖ్యపై చైనా వెల్లడించే వివరాలను... అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తీవ్రంగా ఖండించింది.
 

ప్రపంచలో మొత్తం కేసులు: 10, 34, 086
మరణాలు: 54, 463
రికవరీ కేసులు: 2, 20, 023

 

ఇండియాలో మొత్తం కేసులు: 2567 
మరణాలు: 72 
కొత్త కేసులు: 24
రికవరీ కేసులు: 192 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 154
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9 
ఏపీలో మొత్తం కేసులు: 161
మృతులు: 1

 

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 23
గుంటూరు: 20
కడప: 19
ప్రకాశం: 17 
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 14
తూర్పు గోదావరి: 9  
చిత్తూరు: 9 
అనంతపురం: 2 
కర్నూలు: 1

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: