క‌రోనా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజృంభించిన కొద్దీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు కొంత‌మంది ఉద్యోగులు దురుద్దేశ పూర్వ‌కంగా ఆటంకం క‌లిగించ‌వ‌చ్చు అని ఇంట‌లిజెన్స్ స‌మాచారం మేర‌కు ఎస్మా చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చారు.  ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులను ఎస్మా పరిధిలోకి తెచ్చారు. రాబోయే 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తున్న‌ట్లు వెంట‌నే జీవో కూడా జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుదంటూ జీవో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. 

 

ఈ జీవో విష‌యం తెలియ‌డంతో ఉద్యోగ వ‌ర్గాల్లో మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. నిర్బంధంగా ప‌నిచేయించ‌డం స‌రికాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్యోగులు కూడా మ‌నుషుల‌నే విష‌యాన్ని ప్ర‌భుత్వాలు గుర్తు పెట్టుకోవాల‌ని సున్నితంగానే ప్ర‌భుత్వానికి సూచిస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఎలాంటి అవాంత‌రాలు, గైర్హాజ‌రీలు ఉండ‌కూడ‌ద‌నే స‌దుద్దేశంతోనే ప్ర‌భుత్వం ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కావాల‌ని ఇబ్బందులు పెట్టే ఉద్దేశం ప్ర‌భుత్వానికి లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

 

 ఇదిలా ఉండ‌గా ఎస్మా ప‌రిధిలోకి  వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని చేర్చారు. దీంతో పాటు వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఏపీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది. మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వేస్ట్ వంటి అత్య‌వ‌స‌ర సేవ‌ల ఉద్యోగుల‌ను మాత్ర‌మే ఇందులో చేర్చారు. వైద్యుల‌పై జ‌రుగుతున్న దాడులను రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఖండిస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి కృషి చేస్తున్న వైద్యులు దేవుళ్ల‌తో స‌మాన‌మ‌ని కొనియాడుతున్నారు. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: