భారత్ లో లాక్ డౌన్ విధించినా సరే కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి అనేది అర్ధమవుతుంది. మన దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఢిల్లీ మత ప్రార్ధనల నుంచి వచ్చిన వారి విషయంలో కేసులు పెరుగుతున్నాయి. ఉత్తరాదిలో తక్కువగానే ఉన్నా దక్షినాది రాష్ట్రాల్లో మాత్రం ఇది ఎక్కువగా ఉంది. తమిళనాడు రాష్ట్రంలో కరోనా చుక్కలు చూపిస్తుంది అనేది అర్ధమవుతుంది. ఆ రాష్ట్రంలో కరోనా ప్రభావం తక్కువ అని అక్కడి పాలకులు భావించారు. కాని అది వాస్తవం కాదని అక్కడ కేసులు ఇంకా పెరుగుతాయని అంటున్నారు. 

 

తమిళనాడు తో పాటుగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి, కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే తగ్గడం లేదు. కేవలం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచే ఈ కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది అనేది అర్ధమవుతుంది. కరోనా వైరస్ కట్టడి విషయంలో మన దేశం చాలా వెనుకబడి ఉందని వైద్య సిబ్బందికి సరైన సదుపాయాలు లేవు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతే రోగులకు వైద్యం చేసే వారు ఎవరూ ఉండరు అంటున్నారు. 

 

భారత ప్రభుత్వం ముందు దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని దాన్ని తక్కువ అంచనా వేయడం ఎంత మాత్రం మంచిది కాదు అని కొందరు అంటున్నారు. కరోనా కేసులు ఇంకా పెరిగితే మాత్రం మన దగ్గర వైద్య సదుపాయాలు అంతగా లేవు అని వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఏ విధంగా కూడా లైట్ తీసుకోవద్దని, సామాజిక దూరం పాటిస్తే తగ్గుద్ది అనుకోవడం భ్రమ అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: