కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కరోనా వైరస్ బారిన ఇప్పటికే 10 లక్షలమందికిపైగా పడ్డారు. అందులో 54వేలమంది మృత్యువాత పడ్డారు. ఇంకా అలాంటి కరోనా వైరస్ మన భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుంది. 

 

అయితే అలాంటి ఈ కరోనా వైరస్ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా 21 రోజులు పాటు ఎవరు బయటకు రాకూడదు అని లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయినప్పటికీ భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తుంది. తెలంగాణ, ఆంధ్రలో అయితే రోజుకు 30కు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ప్రభావం ఖైదీలపై పడకుండా ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేసింది. అయితే విడుదలైన వారంతా కూడా ఇష్టం వచ్చినట్టు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలి అని నిబంధనలు పెట్టారు.. 

 

అయితే 259మందిని బెయిల్‌పై విడుదల చేయగా జైల్లో ఉన్న వారందరిని భౌతికదూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే బెయిల్ పై విడుదలైన వారంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లేదా సొంత ఇంట్లోనే ఉండాలి. అయితే విడుదలైన ఖైదీలు అంత కూడా నెల రోజుల తర్వాత తిరిగి జైలుకు వెళ్లాల్సిందే. 
 

అంతేకాదు ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా 81 జైళ్లు ఉన్నాయి. అందులో 6,930 మంది ఖైదీలు ఉన్నారు. వారందరికీ కూడా కరోనా వైరస్ సోకకుండా జైలు అధికారులు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమి అయితే ఏంటి? తప్పులు చేసిన ఖైదీలు కూడా ఈ కరోనా వాళ్ళ శిక్ష నుండి బయటపడుతున్నారు.. హాలిడేస్ తీసుకుంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: