అమెరికాలో కరోనా వైరస్ కట్టడి కాకపోతే మాత్రం ఆ దేశం తీవ్రంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం. ఎన్నో దేశాలకు అండగా నిలిచే దేశం. ఆఫ్రికాలో పేదరిక నిర్మూలనకు అమెరికా సర్కార్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. మధ్య ప్రాచ్యంలో కూడా భారీగా సైన్యాన్ని మోహరించింది అమెరికా. చాలా దేశాలకు ఆర్ధికంగా అండగా ఉండటమే కాకుండా ఆర్ధిక శక్తిగా ఎదిగిన దేశం. ఏళ్ళ తరబడి అమెరికా ఎన్నో దేశాలను తన చెప్పు చేతల్లో ఉంచుకుని అక్కడ పరోక్ష పాలన చేస్తుంది. 

 

అలాంటి అమెరికా మాట ఇప్పుడు ఆ దేశ ప్రజలు కూడా వినే పరిస్థితి కనపడటం లేదు. కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది అమెరికాలో, అది ఏ స్థాయిలో ఉందో కూడా అంచనా వేయడం చాలా కష్టమనే సంగతి అందరికి తెలుసు. అమెరికాలో రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి మినహా తగ్గే అవకాశాలు ఎక్కడా కనపడటం లేదు. అమెరికా ఇలాగే కొనసాగితే మాత్రం దాదాపు కోటి మందిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి . అమెరికా ప్రభుత్వం చాలా వరకు ఆర్ధికంగా నష్టపోయింది. 

 

అక్కడ ఆదాయం కూడా భారీగా పడిపోయింది. అయినా సరే 65 దేశాలకు అమెరికా సాయం చేసింది. ఇప్పుడు తనను తాను నిర్మించుకోవాల్సిన అవసరం మళ్ళీ అమెరికా ముందు ఉంది. ఎన్నికల సమయంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఒక మాట అన్నారు, మెక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. ఇప్పుడు అది ఆ దేశం చెయ్యాల్సిన అవసరం ఉంది. అమెరికా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే కరోనా నుంచి బయటకు రావడం అనేది ఇప్పట్లో అయ్యే పని కాదు. అక్కడి ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా ఉండాల్సిన అవసరం ఉందని, వాళ్ళు మాట వినడం లేదని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: