కరోనా వైరస్ దెబ్బకు ప్రధానమంత్రి నరేంద్రమోడి తొందరలోనే మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. పోయిన నెలలో మోడి ప్రకటించిన మూడు వారాల లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీకి పూర్తయిపోతోంది. మరి తర్వాత ఏమవుతుంది ? ఇపుడిదే అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే మోడి తొందరలో మరో సంచలన నిర్ణయం ప్రకటించబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

ఇంతకీ అదేమిటంటే లాక్ డౌన్ చివరి వారంలో దేశం మొత్తం మీద మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ ఎందుకంటే తాను ఆశించిన రీతిలో లాక్ డౌన్ విజయవంతం కాలేదనే అసంతృప్తి మోడిలో కనిపిస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో తెలిసో తెలియకో జనాలు ఇంకా గుంపులు గుంపులుగానే కనిపిస్తున్నారు. దీని ఫలితంగానే కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అంటే ఇపుడు ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన చర్యలేవీ కరోనా వైరస్ వ్యాప్తిని ఆపటం లేదని అర్ధమైపోతోంది.

 

అదే సమయంలో ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో మార్చి 1-15 తేదీల మధ్య జరిగిన మత ప్రార్ధనలే దేశంలోని వివిధ రాష్ట్రాల కొంపలు ముంచేసింది. మత ప్రార్ధనలకు ఏపి, తెలంగాణా, కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి వేలమంది పాల్గొన్నారు.  ప్రార్ధనల తర్వాత వాళ్ళంతా వాళ్ళ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిన తర్వాతే పై రాష్ట్రాల్లో వైరస్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి.

 

అంటే ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా కొందరు జనాలు పట్టించుకోవటం లేదు. ఇటువంటి వాళ్ళ వల్లే వైరస్ చాలా స్పీడుగా వ్యాపించేస్తోంది. దాంతో చివరి రెండు వారాలైనా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే లాభం లేదని మోడి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకనే ఏప్రిల్ 7వ తేదీ నుండి 14వ తేదీ వరకూ దేశంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి జనాలను ఎవరిళ్ళకు వాళ్ళని స్ట్రిక్ట్ గా కట్టడి చేస్తే కానీ వైరస్ నియంత్రణ సాధ్యం కాదని అనుకుంటున్నాడట. చూద్దాం మరి మోడి ఎప్పుడు ప్రకటిస్తాడో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: