కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి చేయబోతే చెడు ఎదురు అవుతుంది.. ఎందుకంటే లోకంలో మంచికి విలువలేదు కాబట్టి.. ఇకపోతే చెడు అనేది ఆయస్కాంతం లాంటిది టక్కున లాగేసుకుంటుంది.. మంచి అనేది ముళ్లకంచె లాంటిది.. దాని దగ్గరకు వెళ్లాలంటే ఎవడికి మనసు ఒప్పదు.. ఇదిలా ఉండగా ప్రతి దేశం కరోనా కోరల్లో చిక్కుకుని కన్నీరు కారుస్తుంటే బాగ బలిసిన వెధవలు కొందరు ఈ రోగాన్ని ఇంకా వ్యాపింప చేస్తున్నారు..

 

 

ఇక ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎవరైన బయట తిరుగుతే వారికి పోలీసులు లాఠీలతో సన్మానాలు చేస్తున్నారు.. కానీ కొందరు నిషేధాజ్ఞ‌లను అస్సలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ హంగామా చేస్తున్నారు. అదేమని అడిగితే తిరిగి దాడులకు తెగబడుతున్న దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్దితి ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది..

 

 

బయట తిరగకండని మంచిగా చెప్పినందుకు తుపాకీ తీసి కాల్పులు జరిపిన ఘటన అక్కడ కలకలం సృష్టించింది.. ఇక ఆ వివరాలు తెలుసుకుంటే.. ముజఫ్ఫర్‌నగర్ జిల్లా కాక్రోలి గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతుండడంతో అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు జావేద్, దిల్షాద్ ప్రశ్నించారు దీంతో ఆగ్రహానికి గురైన ఆరుగురు యువకులు అన్నదమ్ముల పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.

 

 

అంతటితో ఆగకుండా తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జావెద్ శరీరంలో నుంచి  బుల్లెట్ దూసుకెళ్లగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఇకపోతే ఈ దాడికి పాల్పడిన యువకులు పరారయ్యారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు..

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: