దేశ వ్యాప్తంగా కరోనా వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రపంచంలో చైనా లోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ ఇప్పటికి 200 దేశాలకు వ్యాప్తి చెందింది.  అయితే భారత్ లో మొదటి సారిగా కేరళాలో ఈ కరోనా వైర్ కేసు నమోదు అయ్యింది.  అక్కడే అతి త్వరగా విజృంభించింది.  కేరళా తర్వాత మహరాష్ట్రలో ఈ త్రీవత మరింత పెరిగిపోయింది.  దేశంలో అన్ని రాష్ట్రాలకు  ఈ కరోనా మహమ్మారి ప్రళయతాండవం చేస్తుంది.  అయితే కరోనా ఎక్కువగా వృద్దులకు వస్తుందని అంటున్నారు.. చనిపోయిన కేసులు కూడా ఎక్కువ వృద్దులవే కావడం విశేషం. 

 

ఈ నేపథ్యంలో   కేరళకు చెందిన ఓ వృద్ధ జంట మాత్రం కరోనాను ఓడించి దిగ్విజయంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది. ప్రాణాంతక వైరస్ బారినపడినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్న ఆ జంట సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవడంతో డాక్టర్లు ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు.  వారి తనయుడు కొన్నిరోజుల క్రితం ఇటలీ నుంచి కుటుంబసమేతంగా స్వస్థలానికి వచ్చాడు.

 

కొడుకు ద్వారా ఆ వృద్ధ దంపతులకు కరోనా సోకింది. పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఈ వయోవృద్ధ జంట ఇటీవలే కరోనాతో ఆసుపత్రిపాలైంది. వారిలో భర్త వయసు 93 ఏళ్లు కాగా, భార్య వయసు 88 సంవత్సరాలు. కానీ వీరి సరైన సమయానికి తగు జాగ్రత్తలు తీసుకొని వైద్యం చేయించుకున్నారు.  అక్కడి డాక్టర్లు అందించిన చికిత్సతో ఇరువురు వైరస్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: