కరోనాతో అల్లాడిపోతున్న మనదేశ ప్రజల కోసం విరాళాలు అందించడానికి ఎందరో ప్రముఖులు, ప్రముఖ సంస్దలు ముందుకు వస్తున్నాయి.. ఇందులో సంపాదన వేల కోట్లల్లో ఉన్న వారు కూడా వారి సంపాదనకు తగ్గట్టుగా దానం చేయడంలేదు.. మరికొందరు నాదేశం భారతదేశం అని గర్వపడుతున్నానంటూ పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు.. ఇక ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా సృష్టించిన సంక్షోభం ఏదో చిన్నది కాదు.. విరాళాల విషయంలో ఏమాత్రం నాయకులు స్వార్ధంతో ఆలోచించిన దేశ ఆర్ధిక వ్యవస్ద అధపాతాళానికి దిగజారి సామాన్య మానవుని బ్రతుకులను చిద్రం చేస్తుంది.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సేకరిస్తున్న విరాళాలను ఆచితూచి నిస్వార్ధంగా ప్రజాశ్రేయస్సు కోసం.. దేశ ఆర్ధికప్రగతి కోసం ఉపయోగిస్తే సామాన్యునికి ఊరటలభిస్తుంది..

 

 

ఇకపోతే ఇప్పటి వరకు ప్రముఖ సంస్దలు ఇచ్చిన విరాళాలు తెలుసుకుంటే.. టాటా కంపెనీ తరపున రతన్ టాటా 1500 కోట్లు విరాళంగా ప్రకటించగా.. విప్రో సంస్ద 1100 వందల కోట్లు.. రిలయన్స్ సంస్ద 500 వందల కోట్లు.. ఎన్ఎండీసి సంస్ద 150 కోట్లు.. ఇన్‌ఫోసిస్ 100 కోట్లు.. హీరో గ్రూప్ 100 కోట్లు.. టోరెంట్ గ్రూప్ 100 కోట్లు.. ఏషియన్ పేయింట్స్ 35 కోట్లు.. టీవిఏస్ మోటర్స్ 25 కోట్లు.. పతాంజలి గ్రూప్ 25 కోట్లు.. ఎల్ఏన్‌టీ 150 కోట్లు..ఇలా ప్రముఖంగా పేరు మోసిన సంస్దలు విరాళాలు ప్రకటించగా..  మనం నిత్యం జీవితంలో భాగం చేసుకున్న కొన్ని కంపెనీలు ఇప్పటి వరకు రూపాయి విదల్చకపోవడం సిగ్గు చేటు.. ఇలాంటి కంపెనీలనా మనం ఇంతకాలం బ్రతికించింది అనుకోక తప్పదు..

 

 

అవేంటో ఒక్క సారి పరిశీలిస్తే.. సబ్‌వే కంపెనీ ఇప్పటి వరకు ఏం ప్రకటించలేదు.. దీని దారిలోనే మరిన్ని కంపెనీలు ఉన్నాయి.. పిజ్జా హట్.. మెక్ డోనాల్డ్.. బర్గర్ కింగ్.. కేఏఫ్‌సీ.. ఫ్లీప్ కార్డ్.. అమెజాన్.. మైంత్ర.. స్నాప్‌డీల్.. ఫేస్‌బుక్.. అలిబాబా.. వీవో.. ఒప్పో.. మొదలగు ఈ కంపెనీలు ఇంతవరకు ఒక్క పైసా విరాళంగా మనదేశానికి ప్రకటించలేదు.. ఇవే గాక మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాయి.. మనం మాత్రం ఇంతకాలం వీటిని నెత్తిన పెట్టుకుని ఈ కంపెనీ ఓనర్లకు కోట్లకు కోట్లు బిజినెస్ అందించి వారిని కోటీశ్వరులను చేశాము..

 

 

అందుకే భారత కంపెనీలు ఇలాంటి కష్ట కాలంలో ఆదుకుంటాయి.. విదేశీ కంపెనీల వల్ల మనకు ఒరిగేది ఏం ఉండదని అర్ధం అవుతుంది.. ఈ లిస్టును చూస్తే.. ఛీ ఇన్నాళ్లు ఇంతలా వీటిని పోషించాము వీడి బ్రకుతు చేడా తోచినంత మనదేశానికి విరాళం ఇస్తే వీడి సొమ్ము కరిగిపోదు కదా అని ప్రతి భారతీయుడి మనసు ఆలోచిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: