కరోనా మహమ్మారిపై భారతదేశం తీవ్రంగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 21 రోజుల పాటు లాక్ డౌన్  పాటిస్తున్నారు. ఏప్రిల్ 14 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. లాక్ డౌన్ ఉన్నా ఎమర్జన్సీ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే లాక్ డౌన్ కొనసాగుతున్న కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఢిల్లీ తబ్లిగ్ జమాత్ పర్యటనకు వెళ్లొచ్చిన వారి వాళ్ళ ఈ కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగింది.

 

అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, తాజాగా అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, కరోనా వ్యాప్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కఠినంగా కొనసాగించాలని కోరారు. ఈ క్రమంలోనే జనతా కర్ఫ్యూ మాదిరిగానే, రానున్న ఆదివారం రోజు మరొక కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

 

ఏప్రిల్ 5 ఆదివారం రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లల్లో లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించాలని, తద్వారా కరోనావైరస్‌తో అంధకారంలోకి వెళ్లిపోయిన భారత్‌ ఒంటరి కాలేదని దీనిపై పోరాడి తిరిగి వెలుగులోకి తీసుకొస్తామనే సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పారు.

 

ఇక ఈ విధంగా కరోనాపై యుద్ధానికి 130 కోట్ల మంది భారతీయలు పోరాడాలని పిలుపునిస్తే, లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. కరోనాతో పోరాటానికి లైట్లు ఆర్పేయడానికి సంబంధమేంటని, తాను లైట్ ఆర్పను.. కొవ్వొత్తి వెలిగించనని స్పష్టం చేశారు. ఇలా చేస్తే తనను దేశద్రోహి అంటారని, దానికి కూడా తాను సిద్ధమేనని ఆయన అన్నారు.

 

అయితే కరోనాపై అందరు కలిసి పోరాడాల్సిన సమయంలో అధిర్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి సమయంలో అధిర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: