ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని కి కరోనా వైరస్ పెద్ద సవాల్ విసిరింది. ముఖ్యమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇది పెద్ద సవాల్ అనే విషయం అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను జగన్ ఇప్పటికే ఎన్నో సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశాలు అన్నీ కూడా ఇప్పుడు కరోనా కట్టడికి ఏ మాత్రం ఉపయోగకరం కాదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు గనుక కరోనా వైరస్ ని కట్టడి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ మరో ఇటలీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. 

 

ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నాలుగు రోజుల్లో 150 కేసులకు పైగా నమోదు అయ్యాయి. దీనితో జగన్ సర్కార్ కఠిన నిర్ణయాలు అమలు చెయ్యాలని భావిస్తుంది. చాలా మందికి పరిక్షలు నిర్వహించాల్సి ఉంది. మరణాలను కేసులను దాస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఎక్కువగానే వినపడుతున్నాయి. జగన్ ఇప్పుడు మంత్రులతో సమీక్షలు మానేసి నేరుగా రంగంలోకి దిగి వైద్య ఆరోగ్య శాఖకు భారీగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. అలా అయితేనే కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది సాధ్యమవుతుంది. 

 

కరోనా వైరస్ కట్టడి చేయడానికి వైద్యులకు భారీగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారికి పరికరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏపీ లో చాలా మంది వైద్య సిబ్బందికి మాస్క్ లు కూడా లేని పరిస్థితి ఉందనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ముందు ఈ సమస్య నుంచి జగన్ సర్కార్ వాళ్ళను బయటకు తీసుకుని రావాలి. లేకపోతే మాత్రం పరిస్తితుల్లు చాలా దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ ముందు దీనిపై కసరత్తు చేసి భారీగా నిధులు ఇవ్వకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని అంటున్నారు. వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: