ప్రపంచంలో అత్యధిక దేశాలు కరోనా వైరస్ భూతంతో అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్నాయి.  చిన్న దేశాలే కాదు.. అగ్ర దేశాలు సైతం కరోనా పేరు చెబితే.. గజ గజ వణికి పోతున్నాయి.  ఎక్కడికి వెళ్లినా కరోనా ఉనికి ఉంటూనే ఉంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ సైతం ఈ మహమ్మారితో సతమతమవు తున్నాయి.  దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 2,301 కేసులు నమోదయ్యాయని వివరించింది. వారిలో 2088 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారని తెలిపింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కడ మాత్రం కరోనా కేసులు లేవని వార్తలు వస్తున్నాయి.  ఒకటి కాదు అనేక దేశాల్లో కరోనా లేదని జాన్ హాప్ కిన్స్ వర్సిటీ డేటా చెబుతోంది. త్యధిక దేశాలు పసిఫక్ మహాసముద్రంలో అక్కడక్కడా విసిరేసినట్టుండే చిన్న చిన్న దీవులు. మరికొన్ని ఆఫ్రికా, ఆసియా దేశాలు కరోనా రహిత దేశాల జాబితాలో ఉన్నాయి.

 

కొమోరోస్, కిరిబాటి, లెసోతో, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా దీవులు, నౌరు, ఉత్తర కొరియా, పలావ్, సమోవా, సావో టోమ్ అండ్ ప్రిన్సిపె, సోలోమాన్ దీవులు, దక్షిణ సూడాన్, టోంగా, తుర్కెమెనిస్థాన్, తువాలు, వెనువాటు, యెమెన్ దేశాల్లో కరోనా రహిత దేశాలని హాప్ కిన్స్ వర్సిటీ పేర్కొంది.  మరికొన్ని ఆఫ్రికా, ఆసియా దేశాలు కరోనా రహిత దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలకు ఇతర దేశాలతో పెద్దగా సంబంధాలు లేకపోవడం కరోనా అక్కడ ప్రవేశించకపోవడానికి ప్రధాన కారణం.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: