యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ లో విధించిన లాక్ ఏప్రిల్ 14 తేదీ తర్వాత ఎత్తి వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జనాల్లో లాక్ డౌన్ పొడిగింపుపై ఉన్న అనుమానాలను తీరుస్తూ ప్రధాని చేసిన ప్రకటనతో వారంతా ఖుషి అయినా కూడా తర్వాత జరిగే పరిణామాలు తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. 

 

ఇప్పటికే ఢిల్లీలో జరిగిన ముస్లింల మీటింగ్ వల్ల పెరిగిపోయిన కేసులను అదుపు చేయలేక కేంద్రం నానా తంటాలు పడుతుంటే సమయంలో లాక్ డౌన్లోడ్ ఎత్తేస్తే అసలు ఏంటి పరిస్థితి అని పలువురు విద్యావంతుల ప్రశ్న. ఇకపోతే నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అందరూ సీఎంలు లాక్ డౌన్ దశల వారిగా ఎత్తేస్తే బాగుంటుందని భావించినట్లు వచ్చిన వార్తలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

 

ఇకపోతే లాక్ డౌన్లోడ్ ఎత్తివేత తర్వాత కరోనా మరింతగా విజృంభించే అవకాశం ఉందని పలువురు ఆరోగ్యనిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుండే లాక్ డౌన్లోడ్ పరిణామాలపై ఒక అవగాహనకు రావాలని మరియు ఎటువంటి రోడ్ మ్యాప్ సిద్ధంగా లేకుండా చేస్తే అది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం అవుతుందని అంటున్నారు. అది చేసిన తర్వాత జరగబోయే పరిణామాలను హ్యాండిల్ చేయడం ప్రభుత్వానికి ఏమాత్రం సులభం కాదు అని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

 

 అంతేకాదు లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే ముఖ్యమైన నిర్ణయాల గురించి ముందే వెల్లడించాలని తద్వారా ప్రజలు - వ్యవస్థ అందుకు సిద్ధంగా ఉంటారని ఐఐఎఫ్ ఆర్ - ఎన్సీబీఎస్ శాస్త్రవేత్తలు ఐఐటీయన్లు - ఐఐఎస్ ఈఆర్ - ఐఐఎస్సీ ప్రతినిధులు - ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్ మెంట్ ప్రతినిధులు కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: