కరోనా మన జీవితాలను మార్చేసింది. బహుశా ఇంత ఎక్కువగా మన జీవితాలను ప్రభావితం చేసిన ఉదంతం ఈ మధ్య కాలంలో వేరే ఏదీ లేదనుకుంటా.. రోజుల తరబడి దేశమంతా స్తంభించపోవడం అంటే సాధారణ విషయం కాదు. దేశం లాక్ డౌన్ కావడం.. ఎప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితి వస్తుందో తెలియకపోవడం.. రోజుల తరబడి జనం ఇళ్లలో ఉండిపోవడం మనం కనీసం ఎప్పుడూ ఊహించని ఘటనలనే చెప్పొచ్చు.

 

 

మరి ఈ కరోనా మనుషుల జీవితాలపై ఎలాంటి మార్పులు తెచ్చిందో తెలుసా.. ఈ అంశంపై మార్కెట్‌ రీసెర్చ్, అనాలిసిస్‌ సంస్థ వెలాసిటీ ఎంఆర్‌ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చి 19–20 మధ్య హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఈ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. ఇందులో మొత్తం 2,100 మంది పాల్గొన్నారు.

 

 

ఇందులో జనం చెప్పిన దాన్ని బట్టి ప్రజలకు కొత్త అలవాట్లు అలవాటయ్యాయి. వైరస్‌ వ్యాప్తితో ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం పెరిగిందట. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడే అవకాశం ఉందన్న ఆలోచన జనంలో పెరిగిందట. పరిశుభ్రత పాటించి, తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని అరికట్టవచ్చని కూడా జనం భావిస్తున్నారట.

 

 

నూటికి 80 శాతం మంది గతంలో కన్నా మరింత తరచుగా చేతులు కడుక్కుంటున్నారట. 78 శాతం మంది జనసమ్మర్ధం ఉండే ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకున్నారట. అయితే కొందరు మాత్రం ఎంత వద్దనుకున్నా బయట తిరగడం మానుకోలేకపోతున్నారట. కరోనాపై కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలే తీసుకుందని 87 శాతం మంది అభిప్రాయపడ్డారట. షేక్‌హ్యాండ్‌లు, కౌగిలించుకోవడాల్లాంటివి కొంత కాలం పాటు ఆగుతాయని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: