కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. అలాంటి ఈ కరోనా వైరస్ బారిన ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షలమంది పడ్డారు. అందులో 55 వేలమందిపైగా మృతి చెందగా 2 లక్షల 22 వేలమంది ఈ కరోనా బారి నుండి బయటపడ్డారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అమెరికా, ఇరాన్, ఇటలీ వంటి దేశాల్లో విళయతాండవం చేస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే భారత్ లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 2,974కు చేరింది. ఇంకా అందులో 221 మంది కరోనా బారి నుండి కోలుకోగా మొత్తం 77 మంది కరోనా పాజిటివ్ తో మృతిచెందారు. అయితే ఇప్పుడు తాజాగా మరో సంచలన దారుణమైన విషయం తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబై విమానాశ్రయంలో విధులు నిర్వర్తించిన 11 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు. 

 

విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముంబై విమానాశ్రయానికి వివిధ దేశాల నుండి విదేశీయులు భారీగా రాకపోకలు సాగించారు. దీంతో ముందు జాగ్రత్తగా 142 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లను గత కొద్ది రోజులుగా క్వారంటైన్లో ఉంచారు. వీరిలో నలుగురికి గురువారం పాజిటివ్ రాగా మిగతా ఏడుగురికి శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ ప్రకటించింది. ఐతే రాకపోకలు సాగించిన ప్రయాణికుల నుండి కరోనా వైరస్ సోకి ఉంటుంది అని భావిస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

                    

మరింత సమాచారం తెలుసుకోండి: