ప్రపంచంలో ఏ మనిషీ తినలేని దరిద్రమైన ఆహారం తినడం చైనీయులకే చెల్లింది. మన దేశంలో ముద్దుగా పెంచుకునే కుక్కలు, పిల్లుల దగ్గర నుండి మనం భయపడే పాములు, బల్లులు,బొద్దింకలు, గబ్బిలాల వరకూ ఈ చైనీయులు తినని మాంసాహారమే లేదు. పైగా వీటిని బహిరంగంగా మార్కెట్లు పెట్టుకుని మరీ అమ్ముతారు. ఇక కొనేవాళ్ళకి కొదవే లేదు. ఆ మార్కెట్లలో శుభ్రత గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

 

ఇలా అపరిశుభ్రమైన మార్కెట్లలో ఏది పడితే అది కొనడం, తినడం లేనిపోని రోగాలు తెచ్చుకోవడం.. వాళ్ళతో పాటు ప్రపంచం మొత్తాన్ని బాధ పెట్టడం వారికి సాగిపోతుంది. ఈ దరిద్రమైన ఆహారపు అలవాట్ల వల్లే ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని సృష్టించారు. కరోనా కారణంగా ఎంత ప్రాణ నష్టం జరిగినా చైనీయుల బుద్ది ఏమాత్రం మారలేదు. మళ్ళీ కుక్కలు, పిల్లులు, బొద్దింకల మాంసాలతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. కానీ ఇంత జరిగాక కూడా ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? సమస్యే లేదు. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఇదే కొనసాగితే మానవ జాతి మనుగడే కష్టతరం అయిపోతుంది.

 

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలన్నిటికీ చైనా మీద దురభిప్రాయం పడిపోయింది. ఒక్కో దేశం చైనా ఆహారపు అలవాట్లపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కి మరియు ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు.

 

చైనా ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చే విధంగా ఆంక్షలు విధించాలని, ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో చైనా మార్కెట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మారిసన్ ఐకాసని కోరారు. ఒక్క ఆస్ట్రేలియానే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ చైనా ఆహారపు అలవాట్ల మీద ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత వ్యతిరేకత మూట కట్టుకుని చైనా తన అడ్డదిడ్డమైన ఆహారపు అలవాట్లు మానుకుంటుందో లేదో చూడాలి. చైనీయుల విచ్చలవిడితనానికి ఐక్యరాజ్య సమితి అయినా కళ్లెం వేయాలని కోరుకుందాం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: