జనసేన అధినేత ,పవన్ కళ్యాణ్ కరోనా పై పోరుకు రెండు కోట్ల రూపాయలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో కోటి రూపాయలను ప్రధాన మంత్రి సహాయ నిధికి అలాగే మరో కోటిని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళం గా ప్రకటించారు. ఇక ఈ రోజు ఆ ఫండ్స్ ను  ట్రాన్స్ ఫర్ చేశాడు. మొదట కోటి రూపాయలను పీఎం సహాయనిధికి బదిలీ చేశానని తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50లక్షలను అలాగే ఆంధ్రప్రదేశ్ సహాయనిధికి 50లక్షల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేసినట్లు  సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్  తెలియజేశాడు. అంతేకాదు కరోనా పై పోరులో భాగంగా ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఆపైన మీ శక్తి కొద్దీ పీఎం కేర్స్ కు విరాళం ఇచ్చి మోదీ కి నైతిక మద్దతు తెలుపుదామని పవన్ పిలుపిచ్చాడు. 
 
ఇక కరోనా వల్ల లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మిగితా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారికి  పవన్, ట్విట్టర్ ద్వారా సాయం  చేస్తున్నాడు. ఇదిలావుంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో  కరోనా  విజృంభిస్తుంది. నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్థనలకు తెలుగు రాష్ట్రాలనుండి చాలా మంది హాజరు కావడంతో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ ఒక్క రోజే తెలంగాణ లో 75 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 229 కి చేరింది. ఇక ఆంధ్రా లో మొత్తం 161 కేసులు నమోదయ్యాయి. 
 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈక్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: