కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటిందించిన చైనాపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచానికి పెను విపత్తుగా మారిన కరోనా వైరస్ ను అదుపులో పెట్టే మార్గం తెలియక అన్ని దేశాల్లోనూ లాక్ డౌన్ అమలు చేస్తూ, ప్రజలెవ్వరూ రోడ్ల మీదకు రాకుండా చూస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే చైనాపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు.

IHG

 

ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమైన సదరు మార్కెట్లు ప్రపంచానికి తీరని పెను ముప్పు గా పరిగణించినట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ ఆనవాళ్లు తొలిసారిగా చైనాలో బయటపడడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా ఈ రేంజ్ లో ఫైర్ అవుతోంది. అసలు కరోనా వైరస్ పుట్టుకకు చైనీయుల ఆహారపు అలవాట్లే కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే... ? చైనా మార్కెట్లలో కుక్కలు, పిల్లులు, గబ్బిలాలు ఇతర జంతువుల మాంసం అపరిశుభ్ర వాతావరణంలో అమ్మడం సర్వ సాధారణం. దీని కారణంగానే ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టుకొచ్చిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్‌ మారిసన్‌ చైనాపై ఈ రేంజ్ లో ఫైర్ అవ్వటానికి కారణంగా కనిపిస్తోంది. 

 


‘‘తడి మార్కెట్ల(అపరిశుభ్ర మాంసం మార్కెట్లు) కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో మనందరికీ తెలుసు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని డబ్ల్యూహెచ్‌ఓ, ఐరాస చర్యలు తీసుకోవాలి. ఈ వైరస్‌ చైనా మార్కెట్లో పుట్టి ప్రపంచం మొత్తం విస్తరించింది. దీనివల్లే ప్రపంచ మానవాళి మనుగడకు ప్రమాదం ఏర్పడింది. ప్రపంచానికి ఇది సవాలు విసిరింది. ఇలాంటి పరిస్థితుల్లో సదరు మార్కెట్లపై చర్యలు తీసుకోకపోతే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది’’అంటూ మారిసన్‌ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: