మొన్న దేశమంతా శ్రీరామ నవమి జరుపుకుంది. కరోనా ప్రభావంతో శ్రీరామనవమి కూడా ఈసారి కళ తప్పింది. చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం భక్తులు లేకుండా నిరాడంబరంగా జరిగింది. కేవలం మంత్రులు, అర్చకులు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు.

 

 

అయితే అసలైన శ్రీరాముడు ఏం చేస్తున్నాడో తెలుసా..అంటూ ఓ చిత్రకారుడు గీసిన శ్రీరాముని చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో ఈ హర్ష అనే చిత్రకారుడు ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తోంది. దేవుడైన శ్రీ రాముడు ఇప్పుడు వైద్యుని రూపంలో సేవలు అందిస్తున్నాడని ఆ చిత్రంలో చూపించారు.

 

 

ఈ చిత్రంలో చిత్రకారుని ప్రతిభ ఆశ్చర్యం గొలపక మానదు. ఎందుకటే.. శ్రీరాముని విల్లంబును సెలైన్ బాటిల్ పెట్టె స్టాండ్ గా చిత్రీకరించారు. అలాగే.. శ్రీరాముుడు తన అమ్ముల పొదిలో బాణాలకు బదులుగా ఇంజెక్షన్లు పెట్టినట్టు గా చిత్రీకరించారు.

 

 

దేశమంతా కరోనా వ్యాపిస్తున్న సమయంలో ఇప్పుడు వైద్యులే దేవుళ్లుగా కనిపిస్తున్నారు. వారే రోగుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. అలాంటి వారికి ఇలాంటి చిత్రంతో ఈ ఆర్టిస్టు తన గౌరవం ప్రకటించారు. అద్బుతంగా ఉంది కదా.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: