కరోనాపై పోరాటంలో జగన్ సర్కారు బిజీబిజీగా ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలోనూ.. రోగులకు ట్రీట్ మెంట్ అందించడంలోనూ తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వ ఏర్పాట్లలో లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ఈ దశలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

 

 

కరోనాపై పోరాటంలో వైద్యులు, సంబంధిత సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

వైద్యులు, సంబంధిత సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచకుండా ఎలా వైద్యం చేస్తారని నిలదీశారు. ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అని వ్యాఖ్యానించారు.

 

 

కరోనా మహమ్మారి ల వల్ల విజృంభిస్తుంటే తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసి వైద్యులు కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారని పవన్ కల్యాణ్ అంటున్నారు. అలాంటి వైద్యులు, సంబంధిత సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన పి.పి..లు ఇవ్వకుండా వైరస్ తో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదన్నారు.

 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మెడికల్ మాస్కులు, గౌన్స్, గ్లోవ్స్, కంటి అద్దాలు వెంటనే వైద్యులకు అందజేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటిని తగిన విధంగా సమకూర్చకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఎన్-95 మాస్కులు కూడా సమకూర్చలేదని, సాధారణ డిస్పోజబుల్ గౌన్స్ మాత్రమే ఇస్తున్నారనే వైద్యుల మాటను ఒకసారి వినాలని పవన్ అంటున్నారు. వైద్యులను ఆపదలోకి నెట్టేయకుండా అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ కల్యాణ్ కామెంట్ చేశారు. మరి పవన్ వ్యాఖ్యలపై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: