ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉదయం 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా రాత్రి వైద్య, ఆరోగ్య శాఖ రాత్రి విడుదల చేసిన బులెటిన్ లో ఒకే ఒక్క కేసు నమోదైంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు కేసుల సంఖ్య తగ్గడం శుభవార్త అనే చెప్పాలి. 

 

ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 162కు చేరింది. ఈరోజు విశాఖ జిల్లాలో కొత్త కేసు నమోదైంది. వైద్య, ఆరోగ్య శాఖ ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్, కాకినాడ జీజీహెచ్ నుంచి ఇద్దరు కరోనా బాధితులు డిశ్చార్జ్ అయినట్లు ప్రకటన చేసింది. దీంతో రాష్ట్రంలో నలుగురు కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఏపీలో కరోనా తొలి మరణం నమోదైంది. ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల ఫలితంగానే ఈరోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 

 

ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏ.ఎన్.ఎంలు, ఆర్పీల సేవలను వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో సర్వేలు నిర్వహిస్తూ కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే గుర్తించి చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యుల సూచనల మేరకు కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు, ఐసోలేషన్ వార్డులకు తరలించాలని సూచించింది.

 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు 16 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటించి రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు కానున్నాయని తెలుస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: