భారత దేశం కరోనాపై తీవ్రంగా పోరాడుతోంది. ఇందుకు ప్రధాని మోడీ నాయకత్వం వహిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను విఘాతం అని తెలిసినా ముందు దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి మోడీ లాక్‌డౌన్‌ ప్రకటించేశారు. అయితే ఈ లాక్‌డౌన్‌ ప్రకటన చేసిన తీరులో మోడీ చాణక్యం బయటపడింది. ముందు రోజు జనతా కర్ఫ్యూ అంటూ ఆదివారం పిలుపు ఇచ్చిన మోడీ... కరోనా పై పోరాడుతున్న వారికి మద్దతుగా చప్పట్లతో దేశమంతా సంఘీభావం ప్రకటించాలని పిలుపు ఇచ్చారు.

 

 

ఈ పిలుపుకు మంచి స్పందన వచ్చింది. ఇదే అదనుగా మోడీ లాక్‌డౌన్ ప్రకటించారు. అయితే ఈ లాక్‌ డౌన్ ప్రకటన వరకూ బాగున్నా.. అసలు కరోనా బీభత్సాన్ని పసిగట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న వాదన కూడా ఉంది. పొరుగున ఉన్న చైనా కరోనాతో తీవ్రం గా ఇబ్బంది పడుతున్న సమయంలోనే ఇండియా మేలుకోవాల్సింది.. కానీ మేలుకోవడంలో కాస్త ఆలస్యమైంది. అదే సమయంలో ఢిల్లీలోని జరిగిన నిజాముద్దీన్ మర్కజ్‌ వంటి భారీ సమావేశాలను నియంత్రించడంలోనూ కేంద్రం విఫలమైంది.

 

 

అదే ఇప్పుడు దేశానికి పెనుముప్పుగా మారింది. అయితే మోడీ తన ప్రసంగాలతో, చరిష్మాతో దేశాన్ని ఒక్కటి చేశారు. కరోనాపై పోరాటానికి ప్రజలను సంసిద్ధులను చేశారు. అయితే లాక్‌డౌన్‌ విధింపులోఉన్న తొందర.. దాని పర్యవసానాలపై మాత్రం దృష్టి పెట్టలేదు. వందల మంది వలస కూలీల పరిస్థితి ఏంటన్నది దూరదృష్టితో ఆలోచించలేదు. దీని ఫలితంగా వేల మంది వలస కూలీల ఆకలి కేకలు టీవీ ఛానళ్లలో ప్రతిధ్వనించాయి.

 

 

అయితే ఉన్నంతలో కరోనా పరిహారం ప్యాకేజీ ప్రకటించడం.. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పత్రికాధిపతులు, క్రీడాకారులు వంటి విభిన్న వర్గాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం, నిర్ణయాలను సమీక్షించుకోవడం వంటి చర్యలతో మోడీ కరోనాపై పోరాటంలో మంచి మార్కులే కొట్టేశారు. దేశమంతా ఒకేసారి చప్పట్లు కొట్టడం, రాత్రివేళ ఒకేసారి దివ్వెలు వెలిగించడం వంటివి చర్యలకు పిలుపు ఇవ్వడం బిగ్‌బాస్‌ టాస్కుల్లా అనిపించినా... ఓ మహమ్మారిపై పోరాటంలో ప్రజలను ఉత్సాహపరిచేందుకు ఆ చర్యలు ఉపయోగపడతాయి. ఓవరాల్‌ గా చూస్తే కరోనా పై పోరాటంలో మోదీ కు ఫస్ట్ క్లాస్‌ మార్కులు వచ్చాయి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: