దేశమంతా కరోనాతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో కేంద్రంతో పాటు రాష్ట్రాలు భాగస్వామ్యం అవుతున్నాయి. వాస్తవానికి ఈ పోరులో రాష్ట్రాలదే కీలక పాత్ర. అయితే కరోనాపై పోరాటం అంటే అది ఖర్చుతో కూడుకున్న పనే. కానీ ఓవైపు కరోనా కారణంగానే రాష్ట్రాల ఆదాయాలు భారీగా పడిపోయాయి.

 

 

మరి ఈ సమయంలో కరోనా పై పోరాటం అంటే రాష్ట్రాలకు తలకు మించిన భారమే. అందుకే కేంద్రం ఈ విషయంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. కేంద్రాలకు కరోనా పై పోరాటానికి నిధులు అందిస్తోంది. తాజాగా రాష్ట్రాలకు విపత్తు ప్రమాద నిర్వహణ కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది.

 

 

మొత్తం 11వేల 92 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేయడానికి కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. పచ్చజెండా ఊపేసింది. 2020-21 ఏడాదికి గాను మొదటి విడత కింద నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కోవిడ్‌-19 నేపథ్యంలో రాష్ట్రాలకు నిధుల కొరత లేకుండా ఉండటం కోసమే విడుదల చేస్తున్నట్లు హోం శాఖ వెల్లడించింది.

 

 

కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఆర్థిక వనరులను పెంచడానికి వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ మొత్తం 17,287.08 కోట్లు విడుదల చేసింది. 15 వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రెవెన్యూ లోటు ఉన్న 14 రాష్ట్రాలకు కూడా నిధులు మంజూరు చేసింది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: