కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందో మీకు తెలీదా? ఎంతమంది ప్రాణాలు తీస్తుంది.. ఎంతమంది జాగ్రత్తలు చెప్తున్నారు.. అయినా మీకు వినిపించదా అని అనాలి అనిపిస్తుంది.. కానీ ఎం చేస్తాం అలా అనలేం కదా.. మనం అనుకుంటాం కానీ.. ప్రజలకు అసలు భయం లేదు.. అయినా భయం ఎందుకు ఉంటుందిలే.. ఇది కేవలం దగ్గు, జలుబే కదా! బయట ఎం బొబ్బలు బొబ్బలు రావు కదా! అందుకే భయం లేదు.. 

 

కరోనా వైరస్ వ్యాపిస్తుంది అని తెలుసు.. అలాంటి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బాధ్యతగా ఉండాలి కదా! కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర లాక్ డౌన్ విధించింది. అయినా సరే కొందరు ముర్కులు బయటకు వస్తున్నారు. లాక్ డౌన్ ను ఉల్లంగిస్తున్నారు.. అలా ఉల్లంఘించిన వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. వెంటనే ఇంటికి వెళ్ళాలి అని ఆదేశిస్తున్నారు.. అలా ఎవరి కోసం చెప్తున్నారు? మీకోసమే కదా!

 

కానీ అర్థం కాదు.. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు.. తిరగకండి వెనక్కు వెళ్ళండి స్వామి అని చెప్తే మండుటెండలో ఉండే పోలీసులపై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే సన‌త్‌న‌గ‌ర్‌లో ఇటీవ‌ల‌ ఇలాగే రోడ్ల‌పైకి వ‌చ్చి గుమిగూడిన కొంద‌రు యువ‌కుల‌ను పోలీసులు ఇళ్లకు వెళ్లాలని హెచ్చరించగా వాళ్లు పోలీసుల‌పైనే దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆ 8 మంది నిందితులని అదుపులోకి తీసుకున్నారు. 

 

ఈ ఘటన జరిగి రెండు రోజులు కూడా అవ్వలేదు ఇంతలోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. మౌలాలి లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక యువకుడు పోలీసులపై తిరగబడి, తల్లితో కలిసి ఏకంగా పోలీస్ కానిస్టేబల్ కాలర్ పట్టుకుని కొట్టే ప్రయత్నం చేసాడు. అంతేకాదు ఆ ముస్లిం మహిళా పోలీసులను బూతులు తిడుతూ కొట్టింది. రాత్రనక.. పగలనక కష్టాలు పడుతున్న పోలీసులపై ఇలా దాడి చెయ్యడం ఎంతవరుకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ఎం అనాలి? 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: