నిజం చెప్పాలి అంటే మన దేశంలో కరోనాకు ఇది ప్రారంభం మాత్రమే అనేది చాలా మంది మాట. మన దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నాం కాబట్టి అదుపులో ఉందీ అనుకున్నా సరే అది వేగంగా విస్తరించడం జనాలు ప్రభుత్వాల మాట వినకపోవడం తో ఇప్పుడు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ ఉన్నా సరే దాని పని అది చేస్తుంది. 

 

ఇప్పుడు రాష్ట్రాలకు కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను ఇప్పుడు కేంద్రం నుంచి సహకారం అనేది అందాలి. అది పూర్తి స్థాయిలో ఉంటేనే కరోనా కట్టడి అవుతుంది. మన పొరుగున ఉన్న చైనా వైద్య సిబ్బందికి భారీగా ఖర్చు చేసింది అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చెయ్యాల్సిన అవసరం ఉంది. భారీగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం అప్పులు చేస్తుందో ఇంకేం చేస్తుందో అనేది అనవసరం. 

 

మన దేశంలో కరోనా కట్టడి అవ్వలేదు అంటే మాత్రం మన దేశం చాలా వరకు ప్రభావితం అవుతుంది అనేది వాస్తవం. కాబట్టి ఇప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుని పక్క దేశాల నుంచి అప్పు తీసుకుంటుందా లేక ఇంకేదైనా చేస్తుందా అనేది అనవసరం. ఇప్పుడు కేంద్ర సర్కార్ రాష్ట్రాలకు అండగా నిలబడలేదు అంటే మాత్రం పరిస్థితి ఇంకా దిగజారే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: