ఇప్పుడు అమెరికాలో కరోనా వైరస్ అనేది కట్టడి కాకపోతే మాత్రం ఆ దేశం పడే ఇబ్బందులు చాలా దారుణంగా ఉండే అవకాశాలు ఉంటాయి అనేది వాస్తవం. అమెరికా అనేది చాలా వరకు అభివృద్ధి చెందిన దేశం. అది గనుక కరోనా వైరస్ ఇప్పుడు గనుక కట్టడి చేయలేకపోతే మాత్రం పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 

 

కరోనా కట్టడి విషయంలో ట్రంప్ సర్కార్ చాలా వరకు అలసత్వంగానే ఉంది. గత రెండు రోజుల నుంచి అక్కడ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. అయినా సరే ట్రంప్ మాత్రం లాక్ డౌన్ ప్రకటించడం లేదు. అక్కడ దేశీయ అంతర్జాతీయ విమానాలతో పాటుగా ప్రజలు నిత్యం ప్రయాణించే వాటి విషయంలో ఏ చర్యలు తీసుకోవడం లేదు అనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినపడుతున్నాయి. 

 

అగ్ర రాజ్యం గనుక కూలిపోతే ఆఫ్రికా దేశాల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నిలబడటం అనేది కొన్ని దేశాల భవిష్యత్తుకి చాలా అవసరం. కరోనా కట్టడి చేయడానికి ఇప్పుడు అక్కడ కఠిన ఆంక్షలు అమలు చెయ్యాల్సిన అవసరం ఉంది. అమెరికా ఇంకా మొండి గా వ్యవహరిస్తే మాత్రం పరిస్థితి మరింతగా కూలిపోయే ప్రమాదం ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: