మనం ఏదైనా అనకూడని మాట అంటే వెంటనే పెద్దవాళ్లు అలా అనకూడదు.. పైన తథాస్తు దేవతలు ఉంటారు అని సున్నితంగా మందలిస్తారు. అసలు ఈ తథాస్తు దేవతలు అంటే ఎవరు.. మనం ఏమి అంటే దాన్ని నిజం చేసేలా.. నువ్వు అనుకున్నట్టే జరుగు గాక.. తథాస్తు అంటూ దీవిస్తారన్నమాట. ఈ మాటలను మనం సింపుల్ గా కొట్టి పారేస్తాం. కానీ ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోందో సారి.

 

 

ఎందుకో చూద్దాం.. సాధారణంగా పిల్లలు ఏమనుకుంటారు.. అబ్బా.. స్కూల్ లేక పోతే బాగుండు రోజు ఎంచక్కా ఇంటి దగ్గర ఆడుకోవచ్చు అనుకుంటారు. ఇంట్లో ఉండే గృహిణులు ఏమనుకుంటారు.. మా ఆయన ఆఫీసు కి వెళ్ళకుండా ఎంచక్కా నాతోనే ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు. ఇక రోజూ ఆఫీసుకెళ్లే మగాళ్లు ఏమనుకుంటారు.. ఛీ దీనమ్మ జీవితం.. ఈ ట్రాఫిక్.. అదేదో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుండు అనుకుంటారు.

 

 

ఇక మిగిలిన సాధారణ గృహిణులు కూడా ఎప్పుడు బిజీబిజీయేనా.. నేను నా భర్త, పిల్లలతో ఎక్కువ సమయం ఇంట్లో గడిపితే బాగుండు అనుకుంటారు. విద్యార్థులు చాలా సార్లు పరీక్షలతో విసిగిపోయి అబ్బా.. ఈ ఎగ్జామ్స్ లేకుంటే బాగుండు అనుకుంటారు. ఇక వృద్ధులు ఎప్పుడూ ఒంటరి జీవితమే.. మా పిల్లలు మాతో కొంత సమయం గడిపితే ఎంత బాగుండు దేవుడా అనుకుంటాడు.

 

 

ఇక కార్మికులు అబ్బా..ఈ పని చేసి చేసి చచ్చిపోతున్నం.. కొంత విశ్రాంతి ఉంటే బాగుండు అనుకుంటారు. కంపెనీల యజమానులు.. ఇంతకాలం కంపెనీ కోసం పని చేస్తున్న. నా కోసం కూడా కొంత సమయం కేటాయించి ఉంటే బాగుండు అనుకుంటారు. ఇక మనల్ని మోసే భూదేవి శ్వాస కూడా తీసుకోలేనంత పొల్యూషన్ ఏర్పడింది.. కాస్త గాలి ఫ్రెష్ ఐతే బాగుండు అనుకుంటుంది. మరి ఇప్పుడు చూడండి. పైన చెప్పిన అందరి కోరికలూ మన కరోనా తీర్చేసిందిగా.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: