కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటు ఏపీ.. అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ బాధితుల కౌంట్ పోటాపోటీగా పెరుగుతూ వ‌స్తోంది. ఒక్కోసారి ఏపీ కేసుల విష‌యంలో తెలంగాణ‌ను డామినేట్ చేసినా ఆ వెంట‌నే తెలంగాణ మ‌ళ్లీ ఏపీని క్రాస్ చేస్తోంది. ఇక గ‌త రెండు మూడు రోజులుగా ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అవుతోంది. అయితే తెలంగాణ‌లో శుక్ర‌వాఆరం ప‌రిస్థితి ఒక్క‌సారిగా తీవ్ర‌మైంది. శుక్రవారం ఏకంగా 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. 

 

ఈ ఇద్ద‌రు మృతుల్లో ఒక‌రు మ‌హిళ కాగా... మ‌రొక‌రు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే తెలంగాణ‌లో న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 229. ఇక 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిద్దరు మినహా అందరూ మర్కజ్‌కు వొళ్లొచ్చిన వారే కావడం గమనార్హం. కాగా, శుక్రవారం 15 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 32 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లకు వెళ్లి వ‌చ్చిన వారితోనే తెలంగాణ‌లో క‌రోనా రెచ్చిపోతోంది.

 

ఇక శుక్రవారం 400 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు, వారి బంధువులకు పరీక్షలు నిర్వహించగా, 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా 600 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు, వారి బంధువుల నమూనాలను వైద్యాధికారులు కరోనా వైద్య పరీక్షలకు పంపించారు. వారి వివరాలు శనివారం వెల్లడయ్యే అవకాశముంది. ఏదేమైనా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చూస్తుంటే తెలంగాణ‌లో అత్యంత సంక్లిష్ట‌మైన ప‌రిస్థితులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ ప‌రిస్థితుల‌ను అక్క‌డ ప్ర‌భుత్వాలు... ప్ర‌జ‌లు ఎదుర్కొంటారో ?  చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: