క‌రోనా రోజురోజుకు మ‌రింత విస్త‌రిస్తూ త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటోంది. వేలాదిమందిని ప్ర‌తీ రోజు పొట్ట‌న‌పెట్టుకుంటోంది. అంతేకాదు..ప్ర‌తీరోజు కొత్త‌గా 75వేలకు పైగా కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టం గ‌మనార్హం. ప్ర‌పంచ వ్యాప్తంగా శుక్ర‌వారం 10 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసులు... శనివారం తెల్లవారు జాముకి 1096684కి చేరుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  ఇప్ప‌టి వ‌ర‌కు  వీరిలో రికవరీ అయిన వారి సంఖ్య 228370గా ఉంది. అలాగే మరణాలు 59,128కి చేరుకున్నాయి. ప్రస్తుతం 809186 మంది కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో 769781 మందికి కరోనా అంతంతమాత్రంగా ఉంది. 

 

అందువల్ల వీళ్లలో చాలా మంది కోలుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయ‌ని  డ‌బ్ల్యూహెచ్‌వో విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అయితే   39,405 మంది మాత్రం తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నార‌ని స్ప‌ష్టం చేసింది. వీరి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ప్రాణాపాయం ఉంద‌ని తెలిపింది.  ఇలాంటి వారి సంఖ్య మొత్తం కేసుల్లో 5 శాతంగా ఉన్న‌ట్లు తెలిపింది. ఇక్కడ మనం ఆందోళన చెందాల్సిన విషయం ఒకటుంది.  చైనాలో కరోనా సోకిన కొత్తలో ప్రతీ 100 మందిలో 2 లేదా 3 మంది మాత్రమే చనిపోయేవారు. ఇప్పుడు కరోనా సోకిన ప్రతీ 100 మందిలో 21 మంది చనిపోతుండ‌టం గ‌మ‌నార్హ‌మ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

 

ఇలా ఈ పర్సెంటేజీ వారం వారం పెరిగిపోతోంది. అంటే కరోనా వైరస్ తీవ్రత ముందు ప్రపంచ దేశాలు యుద్ధం చేయలేకపోతున్నాయనే సంకేతం కనిపిస్తోంది. ఇక అమెరికాలో ప‌రిస్థ‌తి అయితే దారుణంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 276037కు చేరింది.  శుక్రవారం 1314 మంది చనిపోవడంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 7385కి చేరుకుంది. ఇక ఇటలీలో కొత్తగా 4585 కేసులు రాగా... మొత్తం కేసులు 119827ల‌కు చేరుకుంది.  ప్రపంచంలో ఎక్కువ మృతుల సంఖ్య ఉన్నది ఇటలీలోనే కావ‌డం గ‌మ‌నార్హం.భార‌త్‌లో క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 50మందికిపైగా చ‌నిపోయారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: