ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది ఈ కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షలమంది ఈ కరోనా బారిన పడ్డారు.. అందులో 59 వేలమందికిపైగా మృత్యువాత పడ్డారు. అలాంటి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ లో కూడా ఎక్కువగా ఉంది. భారత్ లో కూడా రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. 

 

ఢిల్లీలో మర్కజ్ కు వెళ్లిన వారి నుండే ఈ కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే కరోనా వైరస్ బోర్డర్ దాటింది.. తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు 229కు చేరగా ఆంధ్రలో 164కు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పరీక్షలు ఆస్పత్రి వరుకు వెళ్ళకుండా ఇంట్లోనే నిమిషాల్లో పరీక్ష చేసుకునేలా ఓ ప్రత్యేక కిట్ తెరపైకి వచ్చింది. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ సోకిందో లేద అనే విషయాన్ని ఇంట్లోనే ఉండి నిమిషాల్లోనే తెలుసుకునేలా ప్రత్యేక కరోనా పరీక్ష కిట్లను బయోనె సంస్థ ఆవిష్కరించింది. వీటితో నిర్వహించే పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని, ఈ కిట్లకు భారత వైద్య పరిశోధన మండలి ఆమోదం లభించిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అయితే ఈ కిట్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య సంస్దల సహకారంతోనే రూపొందించారని.. నాణ్యత పరంగా కఠిన పరిశీలన తర్వాతే మార్కెట్లోకి ఈ కిట్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.. ఏమైతేనేం.. కరోనా పరీక్షలు ఈజీ అయిపోయాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: