దేశంలో కరోనా చేస్తున్న కరాళ నృత్యం మామూలుగా లేదు.  కేరళా, మహరాష్ట్ర, గుజరాత్ లో ఈ కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి.  ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల ప్రభావం రోజు రోజు కీ పెరిగిపోతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.  ఈ వైరస్ కేసులు వరసగా పెరుగుతున్నాయి.  మొన్నటి వరకు పెద్దగా ఏపీలో కేసులు లేవు.  కానీ, మార్కజ్ నుంచి వచ్చిన యాత్రికుల నుంచి వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ఏపీ అప్రమత్తం అయ్యింది. 

 

గడిచిన మూడు రోజుల్లోనే వైరస్ కేసులు వేగంగా పెరిగిపోయాయి.  మార్కజ్ నుంచి వచ్చిన వారిని కట్టడి చేసినప్పటికీ వారు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం పెద్ద సమస్యగా మారింది.  వీరంతా ఎక్కడ తిరిగారు.. ఏం చేశారు.. ఏవరితో మీటింగ్స్ పెట్టారు.. అందులో ఎంతమంది పాల్గొన్నారు అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  మొన్న 149 కేసులు ఉంటే నిన్న 161 కి పెరిగింది.. మరో మూడు కేసులు నమోదు కావడంతో 164 కి పెరిగాయి. ఇదిలా ఉంటె, కడప, గుంటూరు, విశాఖ నగరాల్లో కొత్తగా కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నారు. 

 

ఈ మూడు ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్టయితే... రోజుకు 450 నుంచి 570 వరకు కరోనా శాంపిల్స్ ను పరీక్షించే అవకాశం ఉంటుంది.  కాగా, ఢిల్లీ మార్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న 1085 మందిలో ఇప్పటి వరకు 758 మంది నుంచి శాంపిల్స్ ను సేకరించినట్టు తెలుస్తోంది.  ఇక, కోలుకున్న వారిలో ఒంగోలుకు చెందిన 23 ఏళ్ల కుర్రాడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గత నెల 15న అతడు యూకే నుంచి వచ్చాడని, కరోనా లక్షణాలతో అదే రోజున ఒంగోలులోని జీజీహెచ్‌లో చేరాడని పేర్కొన్నారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: