భారతదేశంలో కరోనా  వైరస్ విజృంభణకు  అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రోజురోజుకు విలయ తాండవం చేస్తూ... కోరలు చాస్తోంది మహమ్మారి కరోనా వైరస్. దీంతో భారత ప్రజలు అందరూ రోజురోజుకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. క్రమక్రమంగా ఇండియాను కరోనా  వైరస్ కుదిపేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టిన నిబంధనను అమల్లోకి తెచ్చినప్పటికీ.. కరోనా  వైరస్ కట్టడి మాత్రం ఎక్కడ సాధ్యపడడం లేదు. ఇప్పటికే భారతదేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య రెండు వేలకు దాటి పోయిందట. ఇక ఈ వైరస్ బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో అటు ప్రజల్లో భయాందోళనలు కూడా పెరిగి పోతూనే ఉంది. 

 

 

 అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఈ మహమ్మారి వైరస్ పై విజయం సాధించేందుకు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. భారత ప్రజలు అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొస్తూ కరోనా  వైరస్ పై  విజయం సాధించేందుకు భాగస్వామ్యం కావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ కరోనా  వైరస్ కారణంగా భారత్లో అన్ని రంగాలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. అయినప్పటికీ కరోనా  వైరస్ పోరాటానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కరోనా  వైరస్ పోరాటం కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. 

 

 

 ఈ నేపథ్యంలోనే దేశ సంపన్నులతో  పాటు వివిధ వ్యాపార వేత్తలు ముందుకు వచ్చి కరోనా  వైరస్ పై  పోరాటానికి కోట్లలో విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే చాలా మటుకు సంపన్నులు వ్యాపారవేత్తలు విరాళాలు అందజేయగా... తాజాగా వీరి జాబితాలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా వచ్చి చేరింది. కరోనా  వైరస్ పై  పోరాటానికి ఆదిత్య బిర్లా గ్రూప్ అండగా నిలుస్తూ ఏకంగా 500 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.  ఇందులో నాలుగు వందల కోట్లు పీఎం కేర్స్  కు కేటాయించిన ఆదిత్య బిర్లా గ్రూప్... పిక్కి -ఆదిత్య బిర్లా సీఎస్ఆర్  సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కు 50 కోట్లు... వెంటిలేటర్లు మాస్కులు లాంటి రక్షణ పరికరాల కోసం 50 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామాజిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అంటూ ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: