కరోనా వైరస్ నియంత్రణ విషయంలో కేంద్రప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇపుడిపుడే బయటపడుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఎందుకు ఒక్కసారిగా పెరిగిపోతోందంటే ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే ప్రధాన కారణమని కేంద్రం నిర్ధారించుకుంది. మార్చి 1-15 మధ్యలో జరిగిన ప్రార్ధనల్లో దేశవ్యాప్తంగా సుమారు 10 వేలకు పైగా పాల్గొన్నారు. ప్రార్ధనల్లో పాల్గొని తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళిన వారి వల్లే వైరస్ ఒక్కసారిగా పెరిగిపోయిందన్నది వాస్తవం.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచదేశాల్లో వైరస్ ప్రభావం పెరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో మత ప్రార్ధనలు జరిగాయి. దీనికి విదేశాల నుండి సుమారు 1500 మంది వచ్చారు.  వీరెవరికీ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు సరిగా నిర్వహించలేదు. ఎటువంటి స్క్రీనింగ్ జరపకుండానే దేశంలోని అనుమతించటంతోనే వేల మందికి వైరస్ ను అంటించారు.  నిజానికి తబ్లిగి సంస్ధను రష్యా, చెక్ రిపబ్లిక్ లాంటి కొన్ని దేశాలు నిషేధించాయి.

 

వివిధ దేశాలు నిషేధించిన సంస్ధను మనదేశంలో మాత్రం ఎందుకు నిషేధించలేదు ? పైగా ఇష్టారీతిన కార్యకలాపాటు సాగించేందుకు ఎలా అనుమతిస్తున్నారో అర్ధం కావటం లేదు. తబ్లిగీ సంస్ధ ప్రార్ధనల్లో పాల్గొని తమ రాష్ట్రలకు తిరిగి వెళ్ళిన వారిలో కొందరు ప్రభుత్వాలకు సహకరించటం లేదు. మరికొందరు ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా పరీక్షలు నిర్వహించటాని కూడా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇటువంటి వాళ్ళ వల్లే దేశంలో వైరస్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇటువంటి వాళ్ళు మరో దేశంలో ఇలాగే వ్యవహరిస్తే ఆ దేశ ప్రభుత్వాలు అంగీకరిస్తాయా ?

 

మత ప్రార్ధనలు మొదలయ్యే మార్చి 1వ తేదీకి దేశంలో సమస్య పెద్దగా లేదు. అయితే అప్పటికే చైనా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లాంటి దేశాల్లో ఉధృతంగా ఉంది. మరి విదేశాల నుండి ఒకేసారి 1500 మంది మనదేశంలోకి వస్తే అసలు ఎలా అనుమతించింది కేంద్రం. వారందిరినీ వెంటనే తిప్పి పంపేసుంటే ఇపుడీ సమస్య ఇంతలా ఉండేది కాదు. చూస్తుంటే వైరస్ కేసులు పెరిగిపోవటంలో కేంద్ర నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: