తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభన రోజురోజుకు రోజురోజుకు పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు ఎన్ని  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. లాక్ డౌన్ ప్రకటించి ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసినప్పటికీ... కరోనా  వైరస్ కేసులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకు భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఇక కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయి వారికి ప్రత్యేక చికిత్స కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 

 

 

 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలందరి ప్రాణ భయంతో వణికిస్తున్నప్పటికీ...డాక్టార్లు మాత్రం  వైద్య చికిత్సలు అందించారు... ప్రాణహాని ఉందని తెలిసి కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా  వైరస్ పై  పోరాటంలో వైద్యుల పాత్ర కీలకమైనది. అయితే తెలుగు రాష్ట్రాల్లో  కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న రైతులపై దాడులు జరగడం ఆందోళనకరంగా మారింది. ప్రాణాలకు తెగించి మరీ ప్రాణాంతకమైన వైరస్తో పోరాటం చేస్తున్న వైద్యులను  అభినందించాల్సిందే పోయి చాలా మంది దాడులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 

 

 

 అయితే తాజాగా వైద్యులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కెవిపి రామచంద్రరావు స్పందించారు. వైద్యుల పై జరుగుతున్న దాడులు ఆగాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో తీసుకొచ్చిన చట్టాన్ని మళ్లీ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా  వైరస్పై పోరాటంలో భాగంగా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం ఎంతో బాధాకరమని ఆయన అన్నారు. వైద్యుల పై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. దేశంలో కరోనా  వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. వైయస్సార్ తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధినేత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రస్తుతం చాలా మంది కార్యకర్తలు ఆపదలో ఉన్నవారికి సేవలు అందించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: