క‌రోనా.. క‌రోనా.. క‌రోనా.. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి నోటా ఇదే మాట‌. చైనాలో పుట్ట‌కొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాలను క‌మ్మేసింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు చాచింది. ఇక ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా క‌రోనా బాధితుల సంఖ్య 11 లక్షలకు చేరుకోగా.. మృతుల సంఖ్య 59,100 మందికి పైగా న‌మోదు అయ్యాయి. వైరస్ బారినపడ్డవారిలో ఇప్పటి వరకు 229,000 మంది కోలుకున్నారు. మరో 7.70 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 39,300 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.

 

ప్ర‌స్తుతం ఈ లెక్క‌లు చూస్తుంటే వైర‌స్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ప్ర‌పంచ‌దేశాలు అల‌ర్ట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే దేశ‌దేశాలు లాక్‌డౌన్ విధించాయి. భార‌త్‌లోనూ సైతం లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. అందరూ వద్దు వద్దంటున్నా పనిగట్టుకొని బయటికి వెళ్లి మహమ్మారి వైరస్‌ను కొనితెచ్చుకోవటం ఎందుకు? మనం, మన కుటుంబం, ఇరుగు,పొరుగు ఉద్దేశపూర్వకంగా బలిపీఠానికి చేరువైతే చింతించటానికి మిగిలేది ఎవరు? ఆయువు ఉంటేనే కదా, జీవిక. కాని, ఇలాంటివి ఏమి ప‌ట్టించుకోకుండా కొంద‌రు మాత్రం ప‌నిలేక‌పోయినా రోడ్ల‌పై తిరుగుతున్నారు.

 

ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ప్రభుత్వ జీవో 45, 46, 48 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఐపీసీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. ఒకసారి ఈ చట్టాల కింద కేసులు నమోదైతే జీవితం శూన్యం అవుతుంది. ఎందుకంటే ఈ కేసులు నమోదైన వారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలన్నా, ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనా, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండదని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ కేసు న‌మోదు అయితే  పాటు జైలు శిక్ష పాటు జరిమానం కూడా చ‌ల్లించాల్సి ఉంటుంది. సో.. బీకేర్‌ఫుల్..!!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: