కరోనా మహమ్మారిని ఎదుర్కోవ‌డానికి లాక్‌డౌన్‌ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో పేద ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో సీఎం జగన్ వారం రోజుల క్రితం 1000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అయితే ఇప్పటికే రేష‌న్ పంపిణీ చెయ్యగా ఈరోజు ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లు తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 1000 రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ చేస్తున్నారు.

 

ఇంకా ప్రధాని మోదీ లాక్ డౌన్ పిలుపు మేరకు ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో సీఎం జగన్ పేద ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 1000 రూపాయల ఆర్థిక సహాయం అందించటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక సాయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కొన్ని సూచనలు చేశారు.

 

ఆ సలహాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..  ప్రజలకు వెయ్యి రూపాయిల ఆర్ధిక సహాయంలో భాగంగా నాయ‌కులంతా కూడా ఎక్క‌డిక‌క్క‌డ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని, గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటించేలా చూసుకొని కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని సజ్జల కోరారు. 

 

నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నుండి గ్రామ స్థాయి వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న రేప‌టి కార్య‌క్ర‌మాల్లో వైసీపీ పార్టీ నాయ‌కులు, స్థానిక సంస్థ‌ల పార్టీ అభ్య‌ర్ధులు ఎక్క‌డిక‌క్క‌డ త‌ప్ప‌నిస‌రిగా పాల్గొనేలా చూసుకోవాలి అని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కోరారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: