క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న వేళ్ల స‌క‌లం బంద్ అమ‌ల‌వుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండాల్సిన ప‌రిస్థితి. ఇలా ప‌క్క రాష్ట్రాల‌కు వ‌ల‌స‌బోయిన వారి ప‌రిస్థితి అంతే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంత‌మంది జాలర్లు మ‌హారాష్ట్ర‌లో చిక్కుకుపోయిన న‌ర‌క‌యాత‌న అనుభవిస్తున్నారు. తిండి లేక‌..స‌రైన వ‌స‌తి లేక నానా కష్టాలు ప‌డుతున్నారు. ఈవిష‌యం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు వెంట‌నే జాల‌ర్ల‌ను కాపాడాల‌ని, వారికి సాధ్య‌మైనంత మేర సాయం అదించాల‌ని మ‌హారాష్ట్ర సీఎం  థాక్రేకు ట్విట్ట‌ర్ ద్వారా కోరారు. 

 

లాక్‌డౌన్ అమలు చేయడంతో ముంబై సమీపంలోని దీవిలో శ్రీకాకుళంకు చెందిన 60మంది మత్స్యకారులు ఇరుక్కుపోయాని. జాలర్ల బాగోగుల చూడాలని కోరారు. లాక్‌డౌన్ ముగిసేవరకు సాయం చేయాలని ట్విట్ట‌ర్‌లో రికెస్ట్ చేశారు.ఆక‌స్మాత్తుగా  లాక్‌డౌన్ అమలు చేయ‌డంతో ముంబైకి ద‌గ్గ‌ర‌లోని ఓ  దీవిలో శ్రీకాకుళంకు చెందిన 60మంది మత్స్యకారులు ఇరుక్కుపోయాని వివ‌రించారు. వారి కుటుంబాలు ఎంతో ఆందోళ‌న చెందుతున్నాయ‌ని పేర్కొన్నారు. చంద్రబాబు రిక్వెస్ట్‌పై మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు స్పందించారు.  ఈ విష‌యాన్ని వెంట‌నే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామ‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రిట‌ర్న్ ట్విట్ చేశారు.

 

 ప్ర‌స్తుతం వారిని క‌నుగోనే ప‌నిలో అధికార యంత్రాంగం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.  వారికి వసత కల్పించి.. భోజన సదుపాయం కల్పిస్తామని, వారికి అవసరమైన అన్ని వసతులు స‌మ‌కూరుస్తామ‌ని మ‌హారాష్ట్ర సీఎంవో అధికారులు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. సీఎంవో జాలర్ల సమస్యపై వెంటనే స్పందించడంతో పాటూ సాయం చేస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి థాక్రేకు చంద్రబాబు వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో కూడా  క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు చేపట్టాల‌ని చంద్ర‌బాబు ఆ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. పార్టీ ఆధ్వ‌ర్యంలో విరాళాల సేక‌ర‌ణ కొన‌సాగుతోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: