కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచదేశాలన్నీ ఎంతలా వణికిపోతున్నాయో అందరు చూస్తున్నదే. మిగితా దేశాల సంగతేమో కానీ యూరోపు  దేశాలపైన మాత్రం కరోనా పంజా దెబ్బ బాగా గట్టిగానే తగిలింది.  ఇటలీ, స్పెయిన్ దేశాలపై వైరస్ దెబ్బకు విలవిల్లాడిపోతున్నాయి. ఇదే సందర్భంగా బ్రిటన్లో పరిస్ధితులు కూడా భయంకరంగానే ఉన్నయంటున్నారు. లండన్లో నివస్తున్న తెలుగు వాళ్ళ కోసం తెలుగు రాష్ట్రాల్లోని  వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు.

 

ఇందులో భాగంగానే లండన్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి రమోల మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు కడుతుంటే బ్రిటన్ మాత్రం శ్మశనాలు రెడీ చేస్తోందంటూ భయంగా చెప్పారు. తాను ఉంటున్న చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఇదే విషయమై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుండంతో జనాలందరిలోను టెన్షన్ పెరిగిపోతోందట. ఏరోజు ఎటువంటి వార్త వినాల్సొస్తుందనే భయంతోనే తామంతా గడుపుతున్నట్లు ఆమె చెప్పటాన్ని బట్టే అక్కడి పరిస్ధతి అద్దం పడుతోంది. ఒక్కరోజే సుమారు 570 మంది చనిపోవటంతో జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే శ్మశానాలను రెడీ చేస్తున్నారని ఆమె చెబుతున్నారు.

 

అందుబాటులో ఉన్న సమాచార ప్రకారం బ్రిటన్లో 35 వేలమంది వైరస్ బాధితులున్నారు. ఇప్పటి వరకూ సుమారు 3600 మంది చనిపోయారు. వైరస్ నుండి రికవరీ అవుతున్న వారి సంఖ్య  కేవలం 135 మంది మాత్రమే. అంటే రికవరీ శాతం చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. వైరస్ సోకిన వారి రికవరీ శాతం తక్కువగా ఉందన్న విషయం కూడా ప్రచారంలో ఉండటంతో మిగిలిన వాళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

 

స్పెయిన్, ఇటలీ, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ స్ధాయిలో బ్రిటన్ కూడా బాగా అభివృద్ధి చెందిన దేశమనే చెప్పాలి. కాకపోతే వైరస్ సమస్యను ఏ దేశం కూడా ఊహించనట్లే బ్రిటన్ కూడా ఊహించలేదు. ఒక్కసారిగా దేశంపై విరుచుకుడిన సమస్యతో బ్రిటన్ ప్రభుత్వం కూడా దిక్కుతోచనట్లు ఉండిపోయింది. దాంతోనే సమస్య ఒక్కసారిగా పెరిగిపోయింది. మరి ఆసుపత్రుల నిర్మాణం కన్నా శ్మశానాల నిర్మాణంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందంటే పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: