ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా పడింది.  ఇప్పటికే కేరళా, మహరాష్ట, గుజరాత్, తమిళనాడు ఇలా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.  తెెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎలా ఉన్నా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.  మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లొచ్చిన కుటుంబాల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓల్డ్ సిటీ, కుత్చుల్లాపూర్, నాంపల్లికి చెందిన ఆరు కుటుంబాల్లోనూ నాలుగు కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 

 

మొన్నటి వరకు కరోనా కేసులు మామూలుగా ఉన్నా గత మూడు రోజులు నుంచి మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఈ మూడు జిల్లాల తర్వాత వరంగల్ అర్బన్ (18), కరీంనగర్ (17) ఎక్కువ ప్రభావం ఉంది. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఇప్పటిదాకా 20 జిల్లాల్లో ఈ ప్రాణాంతక  వైరస్ బారిన పడిన రోగులను గుర్తించారు. ఈ నెల 2వ తేదీ వరకు 154 కేసులు నమోదవగా అందులో సగం కేసులు (76) గ్రేటర్ పరిధిలోనే బయటపడ్డాయి. హైదరాబాద్‌ లో 50, రంగారెడ్డి లో 15, మేడ్చల్‌లో 11 కేసులు గుర్తించారు.

 

గత కొన్ని రోజులుగా తెలంగాణలో విదేశీయులు నుంచి వచ్చినవారికే ఎక్కువగా ఉండగా.. తాజాగా ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వల్ల ఈ కరోనా వ్యాప్తి బాగా పెరిగిపోతుందని అంటున్నారు. 154 కేసుల్లో దాదాపు సగం మంది మర్కజ్‌ బాధితులే. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 75 మందికి పాజిటివ్ తేలింది. వారి ద్వారా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరో 33 మందికి వైరస్ సోకింది. మర్కజ్‌ కు వెళ్లొచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారితో కలిసి మొత్తంగా 108 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: