ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇటు ఏపీ లోను, అటు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

 

తెలంగాణ వ్యాప్తంగా శుక్రవార రాత్రి వరకు 229 కరోనా కేసులు నిర్ధారణ కాగా, వీటిలో 100కు పైగా కేసులు గ్రేటర్‌లోనే నమోదయ్యాయి. హైదరాబాద్‌ జిల్లాలో 75..రంగారెడ్డి జిల్లాలో 16, మేడ్చల్‌ జిల్లాలో 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

 

ఒకవైపు వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి చాపకింద నీరులా విస్తరిస్తుండటం..మరో వైపు గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 20 నుంచి 30పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో మహానగరంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రోగుల విషయంలో అత్యంత గోప్యతను పాటిస్తూ...వివరాలు వెల్లడించడం లేదనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

 

వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ దగ్గర పడుతున్న కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతుండటం, వైరస్‌ మరింత బలపడి విస్తరించే ప్రమాదం ఉండటంతో గ్రేటర్‌ వాసుల్లో ఆందోళన నెలకొంది. వచ్చే వారం రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనివైద్యులు తెలుపుతున్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 మంది కరోనాతో చనిపోయారు. వీరిలో ఒకరు నిజామాబాద్, ఇంకొకరు గద్వాల్, మరొకరు నిర్మల్‌కు చెందిన వారు. మిగిలిన 8మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వారే. పాజిటివ్‌ కేసుల్లోనే కాదు.. మరణాల్లోనూ హైద్రాబాద్ టాప్‌లో ఉండటం అందరిని ఆందోళన కలిగిస్తున్న విషయం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: