ఓ వైపు దేశంలో కరోనా కట్టడి కోసం ఎన్ని కష్టాలు పడుతున్నా.. మరోవైపు ఇది విజృంభిస్తూనే ఉంది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య కరోనా వైరస్ తాకిడి ఎక్కువ అయ్యింది.  ఢిల్లీలోని ప్రార్థనలు చేసి వచ్చిన వారి తో ఈ కరోనా ఎక్కువ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. తాజాగా విశాఖలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ముంబై నుంచి వచ్చిన యువకుడి ద్వారా అత్త, బావమరిదికి కూడా కరోనా సోకింది.  విశాఖలో నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య 4కు చేరుకుంది.

 

రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 15 కేసులు నమోదయ్యాయి.. తొలి మరణాన్ని నిన్న అధికారులు వెల్లడించారు. చనిపోయిన 4 రోజులకు తొలి కరనా మరణాన్ని వెల్లడించడం గమనార్హం.  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది... రెండు, మూడు రోజుల వ్యవధిలో అనూహ్యంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. నిన్న ఒకే రోజు 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది.  నిన్న తూర్పు గోదావరి జిల్లాలో రెండు, విశాఖపట్టణంలో ఒక కేసు నమోదయ్యాయి.

 

వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 164కు పెరిగింది. ఇదిలా ఉంటే విజయవాడలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలవరపెడుతున్న విషయం తెలిసిందే.  ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన కుటుంబంగా తేల్చేశారు అధికారులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: